Ramoji Film City: గిన్నీస్ బుక్లో రికార్డుల.. 2000 ఎకరాలు.. 2500 సినిమాలు.. రామోజీ ఫిలిం సిటీ గురించి మీకు ఇవి తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramoji Film City Unknown Facts: రామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు 1996లో స్థాపించిన ఈ ఫిలిం సిటీ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం అదేనండీ ఫిలింసిటీ. హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన అనేక భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి, నిర్మించబడుతున్నాయి. ఇందులో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల ఫిక్స్డ్ సెట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్‌సిటీ ఇన్ ది వరల్డ్)గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన ఈ ఫిల్మ్‌సిటీలో కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకుంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Ramoji Rao: నిర్మాతగా ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన రామోజీరావు
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
సినిమా షూటింగ్ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు ఒకేచోట లభ్యమయ్యే ప్రదేశంగా ఫిల్మ్‌సిటీ గుర్తింపు పొందిందనే చెప్పాలి. ఇక్కడికి రాని ఇండియన్ సినీ ప్రముఖులు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఏడాదికి సగటున 13 లక్షల మంది పర్యాటకులు ఫిల్మ్ సిటీని సందర్శిస్తున్నారు. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లను తెలుగు నేలపై ఆవిష్కరించడం రామోజీరావుకు మాత్రమే కాదు హైదరాబాదుకు కూడా ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది.
ఇక ఫిల్మ్ సిటీతో పాటు ఉషాకిరణ్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను కూడా రామోజీరావు స్థాపించారు. ఫిల్మ్ సిటీలో దాదాపు 2500కు పైగా సినిమాల చిత్రీకరణ జరిగినట్లు అంచనా. ఇక్కడ చిత్రీకరించిన కొన్ని బ్లాక్‌బస్టర్‌లలో చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్, బాహుబలి మరియు డర్టీ పిక్చర్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!