Site icon NTV Telugu

Maamannan Collections: బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతున్న ”మామన్నన్”

Maamannam

Maamannam

Maamannan Collections: ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన తాజా చిత్రం, మామన్నన్, బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతోంది. ఇక ఒక రేంజ్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతోంది. కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాదు ప్రేక్షకుల ప్రసంసలు కూడా అందుకుంటూ రచ్చ రేపుతోంది.పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ వంటి సినిమాలు చేసి బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపే సినిమాలు చేస్తాడని పేరున్న మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా అతని కెరీర్ బెస్ట్ గా నిలిచింది. మారి సెల్వరాజ్ దర్శకుడిగా ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. హాలిడే అడ్వాంటేజ్‌తో, ఈ సినిమా తమిళనాడులో 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఉదయనిధి స్టాలిన్ కెరీర్లోనే ఇది ఒక భారీ ఓపెనింగ్.

Ee Nagaraniki Emaindi: రీ రిలీజ్లో మెంటల్ ఎక్కిస్తున్న కలెక్షన్స్

చాలా గ్యాప్ తరువాత స్టాలిన్‌కు అత్యధిక ఓపెనింగ్ సినిమా దొరికినట్టు అయింది. ఈ సినిమాకి మంచి మౌత్ టాక్ రావడంతో వారాంతంలో ఎ సినిమా దుమ్ము రేపే అవకశం ఉందని ట్రేడ్ వర్గాలు ఖచ్చితంగా అంచనాలు వేస్తున్నాయి. వడివేలు సీరియస్ రోల్‌లో నటించినందున మామన్నన్ ప్రేక్షకులలో చాలా అంచనాలు ఏర్పరచింది. ఇక ఈ సినిమా కథ ఒక దళిత ఎమ్మెల్యే మరియు అతని కొడుకు చుట్టూ తిరుగుతుంది. వారి జీవితాలను మార్చే మరియు వారి అహంకారాన్ని ప్రమాదంలో పడేసే సంఘటన తర్వాత వారి జీవితాలు ఏమయ్యాయి అనే నేపధ్యంలో కధ రాసుకున్నారు. ఇక వడివేలుతో పాటు, మామన్నన్‌లో కీర్తి సురేష్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించారు.

Exit mobile version