Udaya Bhanu : యాంకర్ ఉదయభాను ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె నటిస్తున్న మూవీ బార్బరిక్ త్రిబాణధారి. ఆగస్టు 22న మూవీ వస్తున్న క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది ఉదయభాను. తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను యాంకర్ గా మారిన తర్వాత ఎన్నో ఆఫర్లు రిజెక్ట్ చేశా. అప్పట్లో కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో ఆఫర్లు ఇచ్చారు. కానీ వద్దని చెప్పా. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో పార్టీ సాంగ్ కోసం నన్ను అడిగారు అంటూ తెలిపింది ఉదయభాను.
Read Also : Nikhil Abburi : 100% లవ్ లో బుడ్డోడు.. ఇప్పుడు హీరోలా మారిపోయాడే..
కానీ నేను నో చెప్పాను. ఆ సినిమాలో అంత పెద్ద స్టార్స్ మధ్య నేను నటించాలంటే ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. అందుకే వద్దని చెప్పేశాను. చాలా సినిమాలకు అంతే. నాకు స్క్రిప్ట్ నచ్చకపోతే వెంటనే నో చెప్పేస్తా. అలా చాలా ఆఫర్లు మిస్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ లో యాంకర్లు అందరూ సిండికేట్ అయిపోయారని.. తనకు వ్యతిరేకంగా ఉన్నారంటూ సంచలన కామెంట్లు చేసింది. త్వరలోనే టాలీవుడ్ లో తనను ఇబ్బంది పెట్టిన వారి గురించి బయట పెడుతానంటూ వార్నింగ్ ఇచ్చింది. ఉదయభాను ప్రస్తుతం యాంకర్ గా అవకాశాలు రాక బయట కనిపించట్లేదు.
Read Also : Dasari Kiran : వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్
