కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. ఇప్పటికే ఒక పక్క తెలుగులో కీలక పాత్రల్లో నటిస్తూనే మరో పక్క పాన్ ఇండియా సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’ లో నటిస్తున్న ఉపేంద్ర తాజాగా మరో పాన్ ఇండియా మూవీని ప్రకటించారు. ఈ చిత్రంలో లహరి మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతుంది. లహరి ఫిలింస్ ఎల్ ఎల్ పీ వీనస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
‘యూ’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తూనే ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో ఉపేంద్ర లుక్ భయంకరంగా ఉంది. స్మశానంలా తలపిస్తున్న ప్రాంతంలో కొమ్ములు తిరిగిన గుర్రంపై భయంకరమైన రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. ఉపేంద్ర కథలు అంటే ఎలా ఉంటాయి అనేది ఉపేంద్ర, రా సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. మరి ఈ సినిమాలో ఉప్పీ ఎలాంటి కథాంశం ఎంచుకున్నాడో చూడాలి. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమాతో ఉపేంద్ర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
