సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ అధికారికంగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో వెంటనే మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. లీకేజీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై మరోసారి అటువంటి లీక్‌లు జరగకుండా ఉండడానికి ప్రొడక్షన్ హౌస్ కంటెంట్‌కి భద్రతను కఠినతరం చేసింది. ఇక ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ సాంగ్ ను ఈరోజే విడుదల చేయనున్నారు.
Read Also : SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్
“కళావతి” సాంగ్ ను సిద్ శ్రీరామ్ పాడగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. తమన్ సాంగ్ విడుదలపై ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ‘కళావతి’ సాంగ్ ప్రోమో ట్రెండింగ్ లో ఉంది.
