తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక గట్టి దెబ్బ కొట్టే విధంగా, జీవితం, ప్రేమ, బాధ్యత, మరియు నైతికతల మధ్య జరుగే హృదయ విదారక కథను “ఇరవై మూడు” సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రాజ్ రాచకొండ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా, ఒక చిన్న గ్రామం చిలకలూరిపేట అనే పల్లెటూరులో ప్రారంభమవుతుంది. అక్కడి యువజంట ప్రేమలో పడతారు. వారి ప్రేమ, సమాజపు ఒడిదుడుకుల మధ్య, పెల్లి కంటే ముందే ఒక పొరపాటు జరుగుతుంది. ఆమె గర్భవతిగా మారిన తరవాత ఆ యువకుడు తన బాధ్యతను గుర్తుంచుకుంటాడు. ఆమెను పోషించడానికి ప్రయత్నిస్తాడు, కానీ సాధారణ పనులతో వచ్చే ఆదాయం సరిపోదు. “ఇంకా ఏదైనా చేయాలి పుట్టబోయే బిడ్డకు మంచి జీవితం ఇవ్వాలి” అన్న ఆశతో తన స్నేహితుడితో కలిసి ఒక దొంగతనానికిపాల్పడతాడు.
అయితే ఆ దొంగతనమే 23 మంది ప్రాణాలను బలితీసుకునే ఒక దారుణం అవుతుంది. నిర్ఘాంతపోయిన అతడు యావజివ కారాగార శిక్షకి గురవుతాడు. ఒక పుట్టబోయే బిడ్డ, పెళ్లి కాని తల్లి, జైలు ఖైదీ తండ్రి ఇది ఒక చిన్న కుటుంబం కోసం ఎంతటి విషాదాంతం, కడుపు ముదిరే బాధ, భావోద్వేగాన్ని చూపిస్తుందో ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది. తల్లి తన బిడ్డకు మంచి భవిష్యత్తు కోసం పుట్టగానే దత్తత ఇవ్వాల్సి వస్తుంది. కలలతో నిండిన జీవితాలు ఒక్కచోట తప్పు జరగడంతో పూర్తిగా ధ్వంసమైపోతాయి. చివర్లో, ఖైదీ చేసిన తప్పుకు బాధపడుతూ, తన మంచితనాన్ని చూపిస్తాడు. అతడి కారణంగా నష్టపోయిన కుటుంబాలు చివరికి అతన్ని క్షమించి, ఊరి గొట్టానికి కట్టిన బంధం నుండి విడిపించేస్తారు. కానీ జీవితాంతం ఖైదీగా ఉండిపోయిన అతడి కథ మాత్రం అక్కడే ముగుస్తుంది. మనసుని తాకే భావోద్వేగం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు రాజ్ రాచకొండ దర్శకత్వం వహించిన ఇరవై మూడు” ఒక సినిమా మాత్రమే కాదు… అది ఒక జీవిత గాథ,. ఒక చిన్న తప్పు ఎంతటి పెద్ద పరిణామాలకు దారితీస్తుందో చెప్పే ఘట్టం. ప్రేమ, బాధ్యత, ఆశ, నైతికత, మరియు క్షమ – అన్నింటినీ మిళితం చేసిన ఈ చిత్రం, ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన చిత్రం అనే చెప్పాలి.