Leo: త్రిష ఫస్ట్ లుక్ ఇలా రిలీజ్ చేశారేంటి గురూ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అక్టోబర్ 19న రిలీజ్ కానున్న లియో మూవీ… టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్ సినిమా తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ సోషల్ మీడియాలో టెంపరేచర్ పెంచుతూ ఉంది. లియో ట్రైలర్ రిలీజ్ మరి కొన్ని గంటల్లో ఉండడంతో #Leo ట్యాగ్ తో పాటు #Trisha ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ అర్జున్ సర్జా, సంజయ్ దత్, విజయ్, లియో ట్రైలర్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో త్రిష కూల్ గా కాకుండా లోకేష్ సినిమాటిక్ స్టైల్ లో భయపడుతూ ఉంది. ఈ పోస్టర్ బయటకి రావడంతో దళపతి విజయ్ ఫ్యాన్స్ అండ్ త్రిష ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #Trisha ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. త్రిషని విజయ్ పక్కన హీరోయిన్ గా చూడడానికి 14 ఏళ్లుగా కోలీవుడ్ సినీ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ లియో సినిమా రాబోతుంది. అసలు విజయ్-త్రిషాల కాంబినేషన్ కోసం ఫాన్స్ అంతగా వెయిట్ చెయ్యడానికి కారణం ఏంటా అని చూస్తే… ఈ ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఒకటి కాదు రెండు కాదు నాలుగు సినిమాల్లో విజయ్-త్రిష కలిసి నటించారు. నాలుగులో మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన విజయ్-త్రిషలు హిట్ పెయిర్ గా నిలిచిపోయారు. ఒక్కడు రీమేక్ ‘గిల్లీ’, అతనొక్కడే రీమేక్ ‘ఆది’, ‘తిరుపాచ్చి’ సినిమాలు విజయ్ కెరీర్ లో చాలా స్పెషల్. ముఖ్యంగా గిల్లీ సినిమా విజయ్ ని ఈ జనరేషన్ స్టార్ లీగ్ లోకి తెచ్చింది. ఈ మూవీలో విజయ్-త్రిష కెమిస్ట్రీ, కామెడీ, డాన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. చివరగా 2008లో ఈ హీరో-హీరోయిన్ కాంబినేషన్ లో ‘కురువి’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. అప్పటినుంచి విజయ్-త్రిష కలిసి సినిమా చెయ్యలేదు. మళ్లీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు లియో సినిమాలో ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. మరి ఆ వింటేజ్ వైబ్స్ ని విజయ్-త్రిష లియో సినిమాతో మరోసారి ఇస్తారేమో చూడాలి.
Also Read
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
- Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
The most-awaited @trishtrashers from #Leo💥#LeoTrailer is releasing Today 💥@actorvijay @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial @7screenstudio @Jagadishbliss @SonyMusicSouth #LeoTrailer pic.twitter.com/0jjrbMKjH0
— Sun TV (@SunTV) October 5, 2023
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!