Site icon NTV Telugu

Vijay Deverakonda : కొత్త నేషనల్ క్రష్షుతో విజయ్ దేవరకొండ?

Tripti

Tripti

Tripti Dimri Replaces Sreeleela in Vijay Deverakonda 12: విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పరుశురాం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో వీరిద్దరూ సూపర్ హిట్ అందుకోగా అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం క్లారిటీ లేదు. ఈ సినిమా షూటింగ్ చివరికి వచ్చేసింది, పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండ తన తర్వాతి సినిమా మీద దృష్టి పెట్టబోతున్నాడు. నిజానికి ఆ సినిమా ఈ సినిమా కంటే ముందే మొదలైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కంటే ముందు దిల్ రాజు సినిమా పూర్తి చేయాల్సి వచ్చిన నేపథ్యంలో శ్రీ లీల వేరే సినిమాలకు షూటింగ్ డేట్స్ కేటాయించింది. ఇప్పుడు సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లాల్సి వస్తున్న సమయంలో శ్రీ లీల డేట్స్ క్లాష్ వస్తున్నాయని తెలుస్తోంది.

Salaar : సలార్ ఓటీటీ రన్ టైం ఎంతంటే..?

తాను సినిమా చేయలేనని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆమెను తప్పించి ఆ ప్లేస్ లో ఎవరైతే బాగుంటుందా అనే విషయాన్ని టీం ఆలోచిస్తుందని తెలుస్తోంది. మొదటి ఆప్షన్ గా వారు తృప్తి డిమ్రీని ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. యానిమల్ సినిమాతో ఆమె ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసింది కానీ యానిమల్ సినిమాకు ఓవర్ నైట్ స్టార్ డం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు బాలీవుడ్ లో కూడా ఎక్కువగానే ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి ఆమె కూడా డేట్స్ కేటాయించ లేకపోతే కన్నడ భామ రుక్మిణి వసంత్ ను టీం ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆమె సప్త సాగరాలు దాటి సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనాలు సృష్టించకపోయినా ఓటీటిలో రిలీజ్ అయిన తర్వాత మాత్రం తెలుగువారికి బాగా నచ్చేసింది. ఈ నేపథ్యంలో తృప్తి లేదా రుక్మిణి ఇద్దరిలో ఎవరో ఒకరిని ఈ సినిమాకి ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.

Exit mobile version