Trikala First Look Poster : కుమారి ఖండం నేపధ్యంలో ‘త్రికాల’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రద్ధాదాస్ , అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ ట్యాగ్ లైన్. మణి తెల్లగూటి దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్ నిర్మాత గా, శ్రీసాయి దీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి, ఓంకార్ పవన్ లు సహా నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ బడ్జెట్‌తో ఫాంటసీ, హారర్ జోనర్ మూవీగా కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. కుమారి ఖండాన్ని పరిచయం చేస్తూనే మూల కథకు పురాణ నేపథ్యంతో పాటు నూతన హంగులను అద్దుతూ టీమ్ సినిమాను ఆవిష్కరించింది. దేవి చిత్రంలో బాల నటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఈ చిత్రంతో ప్రధాన పాత్ర దారుడుగా మీ ముందుకు వస్తున్నారు. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఈ సినిమాను దర్శకుడు మణి తెల్లగూటి అండ్ టీమ్ రూపొందిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని విశేషాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
Also Read
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Tags
తాజావార్తలు
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!