Trigun: ఆ సినిమాలో అన్నీ బూతులే.. కానీ, డబ్బులు బాగా వచ్చాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trigun: తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో త్రిగుణ్. ఇప్పుడీ హీరో ‘లైన్ మ్యాన్’ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్టైనర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రచూర.పి, కాద్రి మణికాంత్, జ్యోతి రఘుశాస్త్రి, భళా స్టూడియో సహ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. మార్చి 15న లైన్ మ్యాన్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శివ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ టికెట్ లాంచ్ చేశారు.
అనంతరం ఈ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. ” తినే ప్రతీ మెతుకు మీద పేరు రాసి ఉంటుందని అంటారు.. ప్రతీ పాత్ర మీద కూడా చేసే వాడి పేరు రాసి ఉంటుంది. మన స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో చిన్న ఉడతలా సాయం చేస్తున్నాను. లేడీస్ లైన్ ఉమెన్‌గా రావడం చూసి.. ఈ సినిమాను చేయాలని అనుకున్నా. కథ సరిగ్గా ఆడలేదు.. చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాలో అన్నీ బూతులే. డబ్బులు బాగా వచ్చాయి. కారు, ఇళ్లు కొనుక్కుని సెటిట్ అయ్యా. కానీ లైన్ మెన్ లాంటి సినిమాలు తీసినప్పుడు రాత్రి పూట ప్రశాంతంగా పడుకుంటాం. ఇప్పుడు సినిమాలకు భాషా సరిహద్దుల్లేవు. లైన్ మెన్లు చేస్తున్న సేవలను ఎవ్వరూ గుర్తించడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేశాను. ప్రకాష్ రాజ్ గారు నా మొదటి సినిమాను నిర్మించారు. ఆయనలా అన్ని భాషల్లో సినిమాలు చేయాలని ఉంటుంది. నా కోరిక తీర్చిన నా నిర్మాతలకు థాంక్స్. వంశీ అన్న నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. బి. జయశ్రీ గారు ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్. ఆమెకు పద్మ శ్రీ అవార్డు వచ్చింది. అలాంటి వారు మా సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నేను వాళ్లకి తెలుగు నేర్పించాను. వాళ్లు నాకు కన్నడ నేర్పించారు. అలా మా సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో షూట్ చేశాం. మనం ఇప్పుడు ఫోన్, టీవీ వంటి వాటికి బానిసల్లా మారాం. ఓ గంట కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చాం. ఓ ఊర్లో పది రోజులు కరెంట్ లేకపోతే ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమా కథ. లేనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఒకప్పుడు మా అమ్మ ఉండేది.. ఇప్పుడు లేరు.. సినిమా బిజీల్లో పడి ఎక్కువగా మాట్లాడేవాడ్ని కాదు. జీవితం చాలా చిన్నది.. చాలా విలువైనది. ఇలా ప్రతీది విలువైందే అని సందేశం ఇచ్చే చిత్రమిది. ఓపెనింగ్స్ తెప్పించేంత బలం, బలగం లేదు. కానీ మా కథే మా బలగం. ప్రతీ ఒక్కరూ మా సినిమాకు కనెక్ట్ అవుతారు. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..