అస్సాంలో భారీ భూకంపం.. ఉత్తర బెంగాల్, భూటాన్‌లోనూ ప్రకంపనలు!
అస్సాంలోని గువాహటిలో 5.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర బెంగాల్, పొరుగున ఉన్న భూటాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం కొద్ది రోజుల క్రితమే.. అంటే సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో కూడిన మరో భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సంభవించింది. ప్రస్తుతానికి, ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. అయినప్పటికీ, అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బూతులు మాట్లాడితేనే సినిమాలు చూస్తున్నారు..
డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోతో మారుతి చేస్తున్న ది రాజాసాబ్ పై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మారుతి తాజాగా బ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ డైరెక్టర్ చెప్పుతో కొట్టుకోవడం చూశాను. డైరెక్టర్లు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. డైరెక్టర్ అంటేనే క్రియేటివ్ గా ఆలోచించాలి. పది మందితో కరెక్ట్ గా పనిచేయించుకోవాలి. అంతేగానీ ఇలా చేస్తే ఇతరులకు నమ్మకం ఎలా ఉంటుంది.
ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ ఈ ముస్లిం దేశమేనా?..
ఖతార్‌లో హమాస్ నాయకత్వం సమావేశం అయిన భవనంపై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ మరో ముస్లిం దేశం అని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతకీ ఆ ముస్లిం దేశం ఏంటి, ఎందుకు దానిని ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంది, అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..ఇజ్రాయెల్, టర్కీ ఒకప్పుడు బలమైన ప్రాంతీయ భాగస్వాములు. కానీ 2000ల చివరి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ నేతృత్వంలో ప్రారంభమైన గాజా యుద్ధం కారణంగా ఈ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గత ఏడాది సిరియాలో బషర్ అల్-అసద్ ప్రభుత్వం పతనం తర్వాత అక్కడ ప్రభావం కోసం ఈ రెండు దేశాలు పోటీ పడుతుండటంతో వాటి మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తుర్కియో అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చాలా కాలంగా పాలస్తీనా ఉద్యమానికి, హమాస్‌కు మద్దతుదారుగా ఉన్నారు.
వాళ్లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్.. ఎందుకంటే..
లారెన్స్ సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో.. తన వ్యక్తిత్వంతోనూ అంతకంటే ఎక్కువ గుర్తింపు సాధించాడు. ఎంతో మందికి నిత్యం ఏదో ఒక రకమైన సాయం అందిస్తూనే ఉంటాడు. అప్పట్లో డబ్బులు చెదలు పట్టిపోయాయని బాధపడ్డ జంటకు అండగా నిలిచాడు. వారికి ఆ డబ్బులు ఇచ్చాడు. రీసెంట్ గా ఓ దివ్యాంగురాలికి సొంతంగా ఇల్లు కట్టించాడు. ఇంకో స్టూడెంట్ చదువులకు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా కొందరు దివ్యాంగులు అయినా డ్యాన్స్ లో ఇరగదీస్తున్నారని.. వారిని పిలిచి డబ్బుల వర్షం కురిపించాడు లారెన్స్.
కాంగ్రెస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది: మోడీ
అస్సాంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆదివారం దరంగ్ జిల్లాలోని మంగళ్‌డోయ్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ భారత సైన్యానికి కాదు, పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులకు, జాతి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తుంది” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అస్సాంను పాలించిందని, కానీ బ్రహ్మపుత్ర నదిపై “కేవలం మూడు వంతెనలు” మాత్రమే నిర్మించిందని విమర్శించారు. అదే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 10 ఏళ్లలో అలాంటి ఆరు నిర్మాణాలను నిర్మించిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ పాత పార్టీ చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను రక్షిస్తోందని అన్నారు. చొరబాటుదారులు భారత్ భూమిని ఆక్రమించుకోవడానికి, జనాభాను మార్చడానికి చేసే కుట్రలను బీజేపీ అనుమతించదని ప్రధాని స్పష్టం చేశారు.
మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు..
బోయినపల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా కీలక అంశాలు బయటపడుతున్నాయి. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్ గౌడ్ దాదాపు 10 నెలలుగా అల్ప్రాజొలామ్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. తయారైన డ్రగ్స్‌ను జయప్రకాశ్ తన టూ వీలర్ ద్వారా సరఫరా చేస్తున్నాడు. సినీ పక్కిలాంటి ప్రాంతాల్లోనూ అతను డ్రగ్స్‌ను టూ వీలర్ పై తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – పలుమార్లు తనిఖీలు జరిగినప్పటికీ, డ్రగ్స్‌తో ఉన్న బ్యాగ్‌ను పోలీసులు చెక్ చేయలేదు. ప్రతి సారి వాహన లైసెన్స్, హెల్మెట్, పొల్యూషన్ పత్రాలు మాత్రమే చెక్ చేసి వదిలేశారు.
జనసేన పార్టీ, పవన్ కల్యాణ్‌పై కుట్రలు.. రెచ్చగొట్టే పోస్టులపై మంత్రి ఫైర్..!
దేశ రాజకీయాలలో మార్పు తీసుకురావాలనేది జనసేన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేశామని తెలిపారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో కులాలను కలపాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ దని.. జనసేన కమిట్మెంట్ తో పనిచేస్తుందన్నారు. వైసీపీ అధినేత జగన్ అవలంబిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. గతంలో వైసీపీ చేసిన అరాచక పాలన ఎవరూ మర్చిపోయారని.. అమలాపురంలో కులాల మధ్య చిచ్చుపెట్టిన తీరు ఎవరూ మర్చిపోరన్నారు. పచ్చటి కోనసీమలో ఘర్షణ వాతావరణం వద్దని ధైర్యంగా నిలబడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనసేనను రెచ్చగొట్టేలా వైసీపీ ప్రవర్తిస్తుందని చెప్పారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను డోర్ డెలివరీ చేసినప్పుడు మీ ఫోన్ కాల్ రాలేదే? డాక్టర్ సుధాకర్ ను వేధించినప్పుడు జగన్ ఫోన్ కాల్ ఏది? అని ప్రశ్నించారు. ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చినప్పుడు మీ సంగతి చూస్తామంటారా? వైసీపీ చేస్తున్న కుళ్లు, రాజకీయాలు, కుట్రలను ప్రజలు గమనించాలన్నారు.
చేవెళ్లలో యోగా గురువుకు హనీట్రాప్.. రూ.50 లక్షలు వసూలు
హైదరాబాద్ శివారులోని చేవెళ్లలో హనీట్రాప్ ఘటన సంచలనంగా మారింది. యోగా గురువును బలవంతంగా వలలో వేసి, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రంగారెడ్డి అనే యోగా గురువు యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవల ఇద్దరు మహిళలు అనారోగ్య సమస్యల పేరుతో ఆ ఆశ్రమంలో చేరారు. వారు ముందే పక్కా ప్రణాళికతో గురువుకు దగ్గరయ్యారు. కొద్ది రోజుల్లో ఆయన విశ్వాసాన్ని గెలుచుకొని, మరింత సన్నిహితంగా మెలిగారు.
నేపాల్‌లో మళ్లీ నిరసనలు.. పక్క దేశంలో అసలు ఏం జరుగుతోంది
నేపాల్‌లో నిరసనలు శాంతించాయని అనుకునే లోపే మళ్లీ నిరసనలు మొదలయ్యాయి. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వాటిల్లో జనరల్-జి నిరసనలో మరణించిన యువకుల కుటుంబాలకు నష్టపరిహారం, వారందరికీ అమరవీరుల హోదా ఇవ్వడం వంటివి ఉన్నాయి. అయినా ఈ కొత్త నిరసనలకు కారణాలు ఏంటి, నేపాలీలు ఎందుకు ఈ నిరసనలు చేస్తున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుందాం.. నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కి అల్లర్లలో మరణించిన ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఇది మాత్రమే కాకుండా మరణించిన వారందరికీ అమరవీరుల హోదా ఇవ్వడానికి కూడా ఆమె అంగీకరించారు. అయితే తాత్కాలిక ప్రధాని నిర్ణయాలతో జనరల్-జి నిరసనకారుల కుటుంబాలు సంతోషంగా లేవు. దీంతో వాళ్లు ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నాకు దిగారు. ఇది మాత్రమే కాకుండా, వాళ్లు చనిపోయిన వాళ్ల పిల్లల మృతదేహాలను తీసుకోవడానికి కూడా నిరాకరించారు.
