Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

“2047 నాటికి ఇస్లామిక్ దేశంగా ఇండియా”.. ఛంగూర్ బాబా కేసులో చార్జిషీట్..

ఉత్తర్ ప్రదేశ్‌లో బలరాంపూర్‌లో జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాబా ముసుగులో హిందువును, సిక్కు మతం మార్చే పెద్ద రాకెట్‌ ముఠాకు ఈయన నాయకత్వం వహిస్తున్న విషయాన్ని యూపీ పోలీసులు బట్టబయలు చేశారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తేలింది. లవ్ జిహాద్ ద్వారా హిందూ, సిక్కు యువతను వలలో వేసుకోవడానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడంతో పాటు, ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు పొందడం, పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రేవంత్ హామీలు గాలిమాటలే

రాష్ట్రంలోని గురుకుల విద్యావ్యవస్థపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వాన్నంగా మారిందని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు ప్రకారం, గురుకులాల్లో విద్యార్థులు విషజ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి కారణాలతో ఆసుపత్రుల పాలవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.

కడపలో దారుణం: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

కడప నగరంలోని భగత్ సింగ్ నగర్‌లో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ముక్కుపచ్చలారని చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేశాడు.. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనను స్థానికులు గమనించడంతో, పెను అనర్థం జరగక ముందే ఐదేళ్ల చిన్నారిని రక్షించారు. వెంటనే స్థానికులు రాజ్ కుమార్ అనే నిందితుడిని పట్టుకుని చితకబాదిన అనంతరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు.

‘నీ వల్ల కాదు’.. అన్న వాళ్లతోనే శభాష్ అనిపించుకున్నా..

తనకు చిన్నప్పటి నుంచి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. సెలవులు దొరికితే కొండల్నీ, గుట్టల్నీ ఎక్కుతూ ఉండేది. పది పాస్ అయిన తర్వాత తన జీవితంలో భర్త వచ్చాడు. కొత్త సంసారం.. సరి కొత్త జీవితం.. తన జీవితం సంతోషంగా సాగిపోవడం కాలానికి నచ్చినట్లు లేదు.. పెళ్లి అయిన ఏడేళ్లకు భర్త మరణం.. ఇకపై తను బతుకుతూ కొడుకు జీవితాన్ని చక్కదిద్దాలనే నిర్ణయంతో దు:ఖాన్ని దిగమింగుకొని జీవితంతో పోరాటం చేస్తుడంగా.. ఒక రోజు కొడుకును క్యాన్సర్ కబలించింది. దు:ఖం.. ఇక జీవితం మొత్తం చీకటే… అనుకొని అక్కడే కూర్చోలేదు. ఆ దుఃఖం నుంచి బయటపడటానికి ట్రెక్కింగ్‌ను సాధనంగా చేసుకుంది. ఇటీవల హిమాలయాల్లోని ‘సర్‌ పాస్‌’ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది.

అవి బాగుండాలంటూ నీచంగా మాట్లాడారు.. రమ్య మోక్ష ఎమోషనల్

అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ అంటే తెలియని వారే ఉండరేమో. ఒక్క వాట్సాప్ ఆడియోతో సంచలనంగా మారారు. ఆ తర్వాత బిజినెస్ మూసుకున్నారు. ఇప్పుడు మళ్లీ పేరు మార్చి రన్ చేస్తున్నారు. అయితే తాజాగా వీరికి ఎదురైన చేదు అనుభవాన్ని అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ పెద్దమ్మాయి సుమ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలిపింది. రీసెంట్ గా మేం ముగ్గురం సిస్టర్స్ థియేటర్ కు వెళ్లాం. అక్కడ మమ్మల్ని చూసి కొందరు గుర్తుపట్టి సెల్ఫీలు దిగారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 2.68 లక్షల గణేష్ విగ్రహాల నిమజ్జనం

హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 2,68,755 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. వీటిలో ఒకటిన్నర నుంచి మూడు అడుగుల వరకు ఉన్న చిన్న విగ్రహాలు 95,782 కాగా, మూడు అడుగులకు మించి ఎత్తైన పెద్ద విగ్రహాలు 1,72,973 ఉన్నాయి. జోన్ల వారీగా చూస్తే, ఖైరతాబాద్ జోన్‌లో 63,468 విగ్రహాలు, కూకట్‌పల్లి జోన్‌లో 62,623 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఈ రెండు జోన్లలోనే అత్యధిక విగ్రహాలు జలవిలీనమయ్యాయి.

రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్..

యాదాద్రి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ వేడి చర్చలకు దారితీశాయి. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ రాజగోపాల్ రెడ్డి, “గతంలో నా రాజీనామా వల్ల మునుగోడు నియోజకవర్గానికి మేలు జరిగిందని నాకు గర్వంగా ఉంది. నాకు మంత్రి పదవి హామీ ఇచ్చిన విషయం నిజమే కానీ, అది ఆలస్యమైనా నేను ఓపికగా ఎదురుచూస్తాను. నాకు వ్యక్తిగతంగా అన్యాయం జరిగినా పర్వాలేదు. కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఎంతటి నిర్ణయమైనా తీసుకోవడానికి నేను వెనకాడను” అని స్పష్టం చేశారు.

దిగజారిన పనితో.. ఎంపీ నుంచి జైలులో క్లర్క్‌గా ప్రజ్వల్ రేవణ్ణ

మాజీ ప్రధాన మంత్రి హెచ్.డీ. దేవే గౌడ మనవడు, హాసన మాజీ JD(S) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తన ఇంట్లో పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో యావజ్జీవ శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరప్పన అగ్రహార జైలులో ఉన్న అతడ్ని లైబ్రరీ క్లర్క్‌గా పనిని కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు. తోటి ఖైదీలకు పుస్తకాలు జారీ చేయడం, వాటికి సంబంధించిన వివరాల రికార్డులను నిర్వహించడం లాంటివి చేయాలని పేర్కొన్నారు.

దైవ సన్నిధిలో పేకాట.. 10 మందిని అరెస్ట్!

కడప జిల్లా మైదుకూరు మండలం భైరవకోనలోని దైవసన్నిధిలో పేకాట ఆడుతున్న 19 మంది పేకాట రాయుళ్లలో 10 మందిని స్థానికులు గుర్తించి, మైదుకూరు అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో రూ.1.57 లక్షల నగదుతో పాటు పేక ముక్కలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ దాడిలో 8 మంది పేకాటరాళ్లు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారిని ఇంకా అదుపులోకి తీసుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అయితే, పోలీసులు ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తుండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతాపరమైన చర్యలను పెంచి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఏరియాల్లో మూడురోజులపాటు నీటి సరఫరా బంద్

హైదరాబాద్ జలమండలి ఈనెల 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు ప్రకటించింది. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్-1 కింద 900 మిల్లీమీటర్ల వ్యాసం గల వాల్వుల మార్పిడి పనులు చేపడుతున్న కారణంగా ఈ సమస్య తలెత్తనుంది. అదనంగా, ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో మరమ్మతులు కూడా జరుగనున్నాయి.

 

Exit mobile version