అమెరికాలో దారుణం.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య
అగ్ర రాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. అధ్యక్షుడు ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యాడు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలోని ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో చార్లీ కిర్క్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.చార్లీ కిర్క్ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఓ దుండుగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. తీవ్రగాయాలు పాలైన చార్లీ కిర్క్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలో మాస్ షూటింగ్స్‌పై విశ్వవిద్యాలయంలో జరుగుతున్న చర్చా కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఈ ఘోరం జరిగింది.
గ్లోబల్ రీచ్ కోసం సిద్ధమవుతున్న ‘కాంతార 1’.. వర్కౌట్ అవుతుందా?
ప్రస్తుతం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న “కాంతార చాప్టర్-1”. నటుడు–దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ డివోషనల్ డ్రామా, ఇప్పటికే విడుదల కానుందన్న వార్తలతోనే విశేషమైన అంచనాలను క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన కాంతార సినిమాకు వచ్చిన అపారమైన విజయాన్ని అందరూ గుర్తుంచుకున్నారు. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఆ సినిమా కేవలం కన్నడలోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో సంచలన హిట్టయింది. ముఖ్యంగా, కథలో ఉన్న కల్చరల్ రూట్స్, ఫోక్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా విజయం కారణంగా, ఇప్పుడు “చాప్టర్-1” పై మరింతగా అంచనాలు పెరిగాయి.
ఆమె నా స్ఫూర్తి.. మంచి యాక్షన్ కథల్లో నటించాలని ఉంది
‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చిత్రంతో తనదైన ముద్ర వేసుకున్న నటి రితికా నాయక్, తాజాగా ఫాంటసీ యాక్షన్ డ్రామా మిరాయ్ లో కీలక పాత్ర పోషించారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సందర్భంగా రితికా నాయక్ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నేడు రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న ఎంపీ మిథున్‌రెడ్డి
వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోనున్నారు. సాయంత్రం 5 గంటల లోపు సరెండర్ కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఐదు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చూసింది. ఐదు రోజుల గడువు ముగియడంతో ఈ సాయంత్రం జైల్లో సరెండర్ అవ్వనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు మిథున్‌రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ నుంచి వాహనంలో జైలుకు వెళ్లనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా మిథున్‌రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు. ఇక రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం మిథున్‌రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
96 సీక్వెల్ ఇక లేనట్లేనా..?
కోలీవుడ్ ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్సైన డైరెక్టర్ ప్రేమ్ కుమార్. స్క్రీన్ మీద లెస్ యాక్టర్లతో, డే అండ్ నైట్ కాన్సెప్టులతో ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో నేర్పరి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలా చేసిన 96, మెయ్య జగన్ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 96ని తెలుగులో జానూగా రీమేక్ చేసినా అప్పటికే ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీలో చూసేసిన ఆడియన్స్ ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. అయితే 96కి మాత్రం తెలుగులోను కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా నుండి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ఎనౌన్స్ మెంట్‌తోనే ఫుల్ ఖుష్ అయ్యారు. కానీ సడెన్లీ ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లు తెలుస్తోంది.
దారుణం.. ప్రేమ వ్యవహారం నచ్చక కూతుర్ని చంపిన తండ్రి
ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం నచ్చకపోవడంతో దారుణానికి తెగించాడు. ప్రేమ వ్యవహారంపై మరోసారి ఇంట్లో ఘర్షణ జరిగింది. ఆవేశానికి గురైన తండ్రి.. ఇనుప రాడ్‌తో కొట్టడంతో కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశాడు. అయితే ఆగస్టు 30న మైలవరం పోలీస్ స్టేషన్లో అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా తండ్రే చంపినట్లుగా గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తుండగా ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకున్నారు. అక్కడ నుంచి మైలవరం తీసుకొచ్చారు. కుమార్తెను చంపిన కేసులో రిమాండ్‌కు తరలించారు. గతంలో రెండో భార్యతో కలిసి గంజాయి కేసులో నిందితుడు జైలుకెళ్లి వచ్చాడు. మరోసారి నిందితుడు ఇంత ఘోరానికి ఒడిగట్టాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్.. వెళ్లి చూస్తే షాక్
హైదరాబాద్ కూకట్‌పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ (45)ను దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని కలకలానికి గురిచేసింది. గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డీసీపీ బాలానగర్ వివరాల ప్రకారం, హత్యపై జార్ఖండ్‌కు చెందిన హర్ష, అతని స్నేహితుడు రోషన్‌లపై అనుమానం వ్యక్తమవుతోంది. ఘటన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం రేణు భర్త, కుమారుడు షాపుకు వెళ్లిపోయారు. సాయంత్రం నుండి రేణు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భర్త ఆందోళన చెందారు. రాత్రి ఏడుగంటల సమయంలో ఇంటికి చేరి, వెనక తలుపు ద్వారా కార్మికునితో తలుపులు తెరిపించారు. ఇంట్లోకి వెళ్లినప్పుడు రేణు అగర్వాల్‌ను హాల్లో కాళ్లు, చేతులు తాళ్లతో బంధించి హత్య చేసిన స్థితిలో కనుగొన్నారు. కత్తులు, చాకులతో దాడి చేసి, గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా తలపై రైస్ కుక్కర్‌తో కూడా కొట్టి చంపినట్లు సమాచారం.
నేడు బాపట్ల జిల్లాలో పవన్‌కల్యాణ్ టూర్ రద్దు.. కారణమిదే..!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ బాపట్ల జిల్లా పర్యటన రద్దైంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల జిల్లాలో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పవన్‌కల్యాణ్ పర్యటన రద్దైంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున హెలీకాప్టర్‌కు అనుమతి లభించలేదు. దీంతో గురువారం చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దైంది. మరోసారి బాపట్ల జిల్లాలో పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఇక బుధవారం కూటమి ప్రభుత్వం అనంతపురంలో భారీ సభ నిర్వహించింది. సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో సభ నిర్వహించారు. ఈ సభకు పవన్‌కల్యాణ్ హాజరై ప్రసంగించారు. 10 నిమిషాల పాటు డిప్యూటీ సీఎం మాట్లాడారు.
కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసిందిగా.. ఎక్కడ చూడాలంటే..
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం “కూలీ”. భారీ అంచనాలతో పాన్-ఇండియా స్థాయిలో ఆగస్ట్ 14న రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. లోకేష్ కనగారాజ్ యూనివర్స్ లో గత మూడు సినిమాలు కల్ట్‌గా నిలిచినా “కూలీ” మాత్రం ఆడియన్స్‌ను డిసప్పాయింట్ చేసింది.