ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నాడు..
అసెంబ్లీకి వెళ్లి అధ్యక్షా అనాలని అందరికీ కల ఉంటుంది.. జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని హోం మినిస్టర్ వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీకి వెళ్ళే అవకాశం జగన్ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం దురదృష్టం అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక.. జగన్ కి ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదు.. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి.. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలి అని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష హోదా కావాలని చిన్న పిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నాడు.. ప్రతిపక్ష హోదా చాక్లెటో, బిస్కెటో కాదు అని మంత్రి అనిత పేర్కొనింది.
నాకు నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాల్సిందే.. భారత్-పాక్ సహా 7 యుద్ధాలను ఆపాను..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరోసారి అవే మాటలు వచ్చాయి. తానే ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరో సారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 కన్నా ఎక్కువ సార్లు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 యుద్ధాలను ఆపినందుకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని అన్నారు. శనివారం జరిగిన అమెరికన్ కార్నర్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుల విందులో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్, పాకిస్తాన్ గురించి ఆలోచించండి. నేను వాణిజ్యంతో యుద్ధాన్ని ఆపాను. వారు వ్యాపారం చేయానుకుంటున్నారు. నాకు ఇద్దరు నాయకుల పట్ల గౌరవం ఉంది’’ అని అన్నారు. భారత్-పాకిస్తాన్ సంఘర్షణను ముగించడానికి ‘‘వాణిజ్యం’’ కీలక పాత్ర పోషించిందని మరోసారి ట్రంప్ చెప్పారు. ‘‘భారతదేశం- పాకిస్తాన్, థాయిలాండ్- కంబోడియా, అర్మేనియా- అజర్‌బైజాన్, కొసావో -సెర్బియా, ఇజ్రాయెల్- ఇరాన్, ఈజిప్ట్ – ఇథియోపియా, రువాండా – కాంగో యుద్ధాలను ఆపాము. వీటిలో 60 శాతం వాణిజ్యం కారణంగా నిలిపివేయబడ్డాయి.” అని ట్రంప్ అన్నారు.
గ్లామర్ విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వేదిక..
హీరోయిన్స్‌పై విమర్శలు కొత్తేమీ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో అవి పరిమితులు దాటితే, ఆ నటి నుంచి బహిరంగ స్పందన వస్తుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నది నటి వేదిక. మహారాష్ట్రకు చెందిన వేదిక ఇప్పటికే 37 ఏళ్లు. అయినప్పటికీ ఆమె అందం, యవ్వన కాంతి చూసి వయసు అంచనా వేయడం కష్టమే. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇంకా స్టార్ హీరోయిన్ స్థాయి కోసం ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా.. గ్లామరస్ లుక్‌లో కనిపించినప్పుడల్లా తనపై తప్పుదారి పట్టించే కామెంట్లు వస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.. “హీరోయిన్లు అంటే చాలు.. విమర్శలు చేయడానికి ఒక వర్గం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దుస్తులు కాస్త గ్లామరస్‌గా ఉంటే, ఏకంగా ఆ నటీమణి క్యారెక్టర్‌నే తప్పుపడతారు. ఇది చాలా తప్పు. అందుకే నేను దుస్తుల గురించి ఎవరైనా విమర్శించినా పట్టించుకోను. నేను బికినీ ధరించి నటించిన నాకేం ఇబ్బంది లేదు. ఎవరో ఏమంటారనే భయమూ లేదు. నాకు నాకే బాగా తెలుసు. తప్పు దారిలో ఆలోచించే వాళ్ళు మారితే మంచిది” అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. ఇక ప్రస్తుతం వేదిక తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒక్కో సినిమా చేస్తూ బిజీగా ఉంది. గ్లామర్, టాలెంట్ రెండింటినీ సమతూకంగా చూపించగల నటి అని మరోసారి నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని.. తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ నళిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వరాష్ట్రం కసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. ఉద్యమంలో పాల్గొన్నందుకు నాటి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా నళిని ఆరోగ్యానికి సంబంధించిన విషయం అందరినీ షాక్ కు గురిచేసింది. చావు బతుకుల మధ్య నళిని కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో తన అనారోగ్యంపై ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ ( వీలునామా/ మరణ వాంగ్మూలం)రాసింది.
అప్పట్లో పంజా.. ఇప్పుడు OG.. విషయం ఏంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటీకే రిలీజ్ అయిన OG ఫస్ట్ సింగిల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక గ్లిమ్స్ సంగతి సరే సరి. ఎక్కడ చుసిన ఇప్పడు అంత OG హైప్ నడుస్తోంది. ఇంతటి హైప్ ఉన్న ఈ సినిమా ఈ నెల 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. కాగా నేడు ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ కాన్సర్ట్ హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున జరగబోతుంది. అయితే ఈ ఈవెంట్ పాస్ ల కోసం డిమాండ్ మాములుగా లేదు. ఎలాగైన సరే ఈవెంట్ కు వెళ్లాలని ఫ్యాన్స్ ఎంట్రీ పాస్ ల కోసం ఎగబడుతున్నారు. డిమాండ్ ఉండడంతో కొందరు ఈ పాస్ లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. నేడు జరగబోయే ఎల్బీ స్టేడియం ఈవెంట్ ఫ్యాన్స్ కు ఎంతో స్పెషల్. కారణం ఏంటంటే 2011లో పవర్ స్టార్ నటించిన పంజా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆడియో ఫంక్షన్ ఒక హిస్టరీ. స్టేడియం లోపల ఎంత మంది ఉన్నారో దానికి నాలుగింతలు బయట రోడ్ పై ఉండిపోయారు. లోపలా, బయట జనాలతో కిక్కిరిసిన ఆ ఫంక్షన్ గురించి చాలా రోజులు మాట్లాడుకునే వారు. ఇక యువన్ శంకర్ రాజా పాటలు ఒక ఊపు ఊపేశాయ్. ఎక్కడ చూసినా నీ చుర చుర చూపులే పంజా అంటూ ఆ పాటే వినిపించేది. మళ్ళీ చాలా కాలం తర్వాత పవర్ స్టార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎల్బీ స్టేడియంలో జరగడం విశేషం. అప్పట్లో పంజాకు ఎంతటి హైప్ ఉందొ ఇప్పుడు OGకు అంతే హైప్ ఉంది. సాయంత్రం 5 గంటలకు మొదలుకాబోతున్న ఈ కాన్సర్ట్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ వేలాదిగా తరలిరాబోతున్నారు. ఈ నేపధ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసారు పోలీసులు.
ఇది నిజమేనా అని అనిపించింది..’ దాదాసాహెబ్ ఫాల్కే గౌరవంపై మోహన్‌లాల్ ఎమోషనల్
మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని గుర్తించి.. 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. మోహన్‌లాల్ అద్భుత సినీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తేలిపారు. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో మోహన్‌లాల్‌ను ఈ అవార్డుతో సత్కరించనున్నారు. ఈ ఘనతపై మోహన్‌లాల్ భావోద్వేగంగా మాట్లాడుతూ.. “ఈ గొప్ప అవార్డు నా జీవితంలో అత్యుత్తమ క్షణాలలో ఒకటిగా ఉంటుంది. విన్నప్పుడు నిజంగానే ‘ఇది నిజమేనా?’ అని అనిపించింది. ఈ అవార్డును కేవలం నాకే కాకుండా తోటి కళాకారులు, దర్శకులు, నిర్మాతలు, సెట్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరు మరియు అభిమానులతో పంచుకోవాలనుకుంటున్న’ అని తెలిపారు. మోహన్‌లాల్ వెల్లడించినట్లుగా, ఈ అవార్డు కేవలం వ్యక్తిగత సాధనకే పరిమితం కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి వ్యక్తి కృషికి గౌరవం. ఈ ఘనత ఆయన జీవితంలో గర్వకరమైన క్షణంగా నిలుస్తూ, భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లను సృష్టించడానికి ప్రేరణగా మారనుంది.
పవన్ కళ్యాణ్ క్రేజ్.. OG ప్రీ రిలీజ్ వేడుక.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. హైదరాబాద్‌లోని LB స్టేడియం చుట్టూ ఉన్న వీధుల్లో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండేలా పలు ఆంక్షలు విధించారు పోలీసులు.
7.7 తీవ్రతతో భూకంపం.. వణికిన మయన్మార్..!
నేడు (సెప్టెంబర్ 21) బంగ్లాదేశ్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మేఘాలయలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ భూకంపం ఉదయం 11:49 గంటలకు (IST) బంగ్లాదేశ్‌తో మేఘాలయ సరిహద్దుకు సమీపంలో సంభవించిందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, మేఘాలయలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా బంగ్లాదేశ్‌లోని ఢాకా, చిట్టగాంగ్‌తో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే, ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
ప్రపంచానికి సవాల్ విసురుతున్న.. చైనా ‘సైలెంట్ కిల్లర్’
ప్రపంచానికి సవాల్ విసిరే ఆయుధ సంపత్తిని శనివారం చైనా ప్రదర్శించింది. ఇందులో ఒక ఆయుధం ప్రత్యేక ఆకర్షిణగా నిలవడమే కాకుండా సైలెంట్ కిల్లర్ అనే పేరును సొంతం చేసుకుంది. చైనా శనివారం చాంగ్‌చున్ ఎయిర్ షోలో తొలిసారిగా తన J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌ను యాంటీ-రేడియేషన్ క్షిపణితో కలిపి ప్రదర్శించింది. దీనిని చైనా తన ఆధునిక ఫైటర్ జెట్‌లను వైమానిక పోరాటానికి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ మిషన్లకు కూడా సిద్ధం చేస్తోందనడానికి స్పష్టమైన సంకేతంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో జరిగిన వైమానిక ప్రదర్శనలో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (AVIC) అనేక క్షిపణులతో పాటు J-35A స్కేల్ మోడల్‌ను ప్రదర్శించింది. ఈ ఆయుధాలలో PL-10E, PL-15E, PL-12AE ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, LD-8A యాంటీ-రేడియేషన్ క్షిపణి వంటివి ఉన్నాయి.
40 వేల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు… అందుకే H-1B వీసా ఫీజుల పెంపు..!
ట్రంప్.. H1B వీసా వార్షిక రుసుమును సడెన్‌గా లక్ష డాలర్లకు (భారత కరెన్సీలో రూ. 88 లక్షలకుపైనే) పెంచిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన తరువాత ఇందుకు గల కారణాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అనేక అమెరికన్ కంపెనీలు అమెరికన్ టెక్ కార్మికులను తొలగించి, వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయని వైట్ హౌస్ చెబుతోంది. అమెరికా వనరులు, ఉద్యోగాలపై అమెరికన్లకే మొదటి హక్కు ఉందని ట్రంప్ పదే పదే పేర్కొన్న విషయం విధితమే.
కీలక ప్రకటన.. గ్రూప్-II సర్వీసెస్ ధృవపత్రాల పరిశీలన..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-II సర్వీసెస్ (సాధారణ నియామకం) కింద వివిధ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించింది. కమిషన్ వెబ్సైట్‌లో ఇప్పటికే ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను ఉంచింది. ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు జరగనుంది. రిజర్వ్ డే సెప్టెంబర్ 25గా నిర్ణయించారు. ఈ పరిశీలన సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ (గతంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ) పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ (పాత క్యాంపస్)లో నిర్వహించబడుతుంది.
