Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

మిరాయ్ లో ‘రాముడు’గా టాలీవుడ్ స్టార్ హీరో

హనుమాన్‌తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా.. నెక్ట్స్ మిరాయ్‌తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పై నిర్మించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రానుంది. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నాడు హీరో తేజ సజ్జా. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినపుడు చివర్లో రాముడు పాత్రకు సంబంధించి చిన్న పాటి క్లిప్ ను చూపించారు. కానీ ఆ ఫేస్ ఎవరనేది క్లారిటీగా చూపించలేదు. విశ్వసనీయ సమాచారం ఏంటంటే మిరాయ్ లో రాముడి పాత్రలో కనిపించబోయేది ఎవరో కాదు టాలీవుడ్ భల్లాల దేవ.. మన దగ్గుబాటి రానా. ఈ సినిమా కథ నచ్చడంతో తేజా సజ్జా కోసం రాముడి పాత్రలో నటించాడట రానా. సెకండాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలలో రాముడి ఎంట్రీ ఉండబోతుందని ఆడియెన్స్ కు బెస్ట్ సినిమా ఎక్స్పీరియెన్స్ నిస్తుందని టీమ్ భావిస్తోంది. అలాగే ఈ సినిమాలో మరొక సర్ప్రైజ్ కూడా ఉందట. మిరాయ్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు తేజా సజ్జా అలాగే మంచు మనోజ్. విలన్ గా తనకు స్పెషల్ ఇమేజ్ తీసుకువస్తుందని మనోజ్ నమ్మకంగా ఉన్నాడు.

గత 15 నెలలుగా రైతులకు నరకం చూస్తున్నారు…

తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కె. రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు, మహిళలు, విద్యార్థులు తీవ్రంగా మోసపోయారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయం విషయంలో రైతులు గత 15 నెలలుగా నరకం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజా మాట్లాడుతూ, “రెండు సంవత్సరాలు గడిచినా రైతు భరోసా ఇవ్వలేదు. కేవలం ఐదు వేలు మాత్రమే ఇచ్చారు. అంతకుమించి ఎలాంటి సహాయం చేయలేదు” అని అన్నారు. యూరియా కొరతను చూపిస్తూ టిడిపి నేతలు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారని ఆమె ఆరోపించారు. నగరి పరిసరాల్లో రైతులకు యూరియా అందకపోవడంతో తమిళనాడు, ప్రొద్దుటూరుకు వెళ్ళి రైతులు కొనుగోలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. “వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నమ్మి రైతులు వారి జీవితాలను నాశనం చేసుకున్నారు” అని వ్యాఖ్యానించారు. మామిడి, చీని, వరి, మిర్చి, పోగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.

వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంట.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు..

మరో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఈ ఘోరానికి పాల్పడ్డారు. ముందుగా ట్రైన్ కింద పడి ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. “వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా” అంటూ సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రియుడు. ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజన్న కూతురు హితవర్షిణి(20). ఘట్‌కేసర్ పరిధిలోని ఓ కాలేజ్ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సెలవులకు ఇంటికి వెళ్లిన హితవర్షిణి.. తిరిగి కాలేజ్ ప్రారంభం అవుతుండడంతో హైదరాబాద్ వచ్చింది. ఇంతలోనే ఏమైందో ఏమోగాని బీబీనగర్–ఘట్‌కేసర్ మధ్యలోని రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులకు సమాచారం అందడంతో డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఆ అల్లరి పిల్ల వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్‌లో మజా డబుల్ అవుతుందా?

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, 15 మంది కంటెస్టెంట్స్ (9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు) బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆదివారం పరిచయ ఎపిసోడ్‌తో ఆరంభమైన ఈ సీజన్ అసలు రచ్చ మాత్రం సోమవారం నుంచి మొదలయింది. ఇక బిగ్‌బాస్ సీజన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. గత సీజన్‌ (BB8)లో మెహబూబ్, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, హరితేజ, రోహిణి, ముక్కు అవినాష్‌లు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి షోలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను రెట్టింపు చేశారు. ముఖ్యంగా రోహిణి, అవినాష్‌ల అల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గౌతమ్ కృష్ణ, అవినాష్‌లు చివరి వరకు హౌస్‌లో నిలవగా, చివరికి నిఖిల్ మలియాక్కల్ విజేతగా నిలిచాడు. ఇలాంటి విజయవంతమైన స్ట్రాటజీ కారణంగానే ఈసారి కూడా బిగ్‌బాస్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అందులో మొదటి పేరు బుల్లితెర నటి కావ్య అలియాస్ దీపిక రంగరాజు (బ్రహ్మముడి ఫేమ్). తమిళనాడుకు చెందిన ఈ అల్లరి పిల్ల ప్రస్తుతం టెలివిజన్‌లో, సీరియల్స్‌లో, బుల్లితెర కార్యక్రమాల్లో తన చలాకీతనంతో, పంచ్ డైలాగ్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది.

బెంగాల్ సీఎంకు ఐదేళ్ల బాలుడి లేఖ- మా అమ్మను ఇంటికి దగ్గరగా బదిలీ చేయండని విజ్ఞప్తి..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హృదయాన్ని కదిలించేలా ఐదేళ్ల బాలుడు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే, అసన్సోల్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు అయితిజ్ఞా దాస్, తన తల్లి స్వాగతా పెయిన్‌ను తమ ఇంటికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశాడు. కాగా, స్వాగతా పెయిన్ 2021లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. కుటుంబానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో టీచర్ గా విధులు నిర్వహిస్తుంది. జాబ్ మూలంగా ఆమె ఎక్కువ కాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ విషయంలో బాలుడు అయితిజ్ఞా లేటర్ రాస్తూ.. మమతా బెనర్జీని “ప్రియమైన మమతా దిదున్” అని సంబోధిస్తూ, “మా ఇల్లు అసన్సోల్‌లో ఉంది.. నా అమ్మ ఉత్తర దినాజ్‌పూర్‌లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తుంది కాబట్టి మా నుండి దూరంగా ఉంటోంది.. చాలా రోజుల తర్వాత మాత్రమే ఇంటికి వస్తుంది.. నేను మా నాన్న, తాతతో ఇక్కడ ఉంటున్నాను.. అమ్మ లేకుండా జీవించడం నాకు చాలా బాధగా ఉంది.. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను.. దయచేసి మా అమ్మను ఇంటికి దగ్గరగా పంపించండి.. ఇకపై మా నుంచి దూరం ఉండేలా చేయకండి అని పేర్కొన్నాడు.

ఆల్ టైమ్ రికార్డ్.. రూ. లక్షా 10 వేలు దాటిన తులం గోల్డ్ ధర.. నేడు రూ. 1360 పెరిగింది..

బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. రూ. లక్షా 10 వేలు దాటింది తులం గోల్డ్ ధర. ఇవాళ ఒక్క రోజే రూ. 1360 పెరిగింది. సిల్వర్ ధరలు కూడా భగ్గుమన్నాయి. కిలో వెండిపై రూ. 3000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,029, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,110 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1250 పెరిగింది. దీంతో రూ.1,01,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1360 పెరిగింది. దీంతో రూ. 1,10,290 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,440 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,40,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,30,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

మొన్న తల్లి.. నేడు తండ్రి! కూతురి కోసం ఊహించని త్యాగం చేసిన రణ్‌బీర్ కపూర్

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ చలాకీగా, పార్టీలు, డేటింగ్‌ లతో గాసిప్స్‌లో ఉండే ఈ హీరో.. ఇప్పుడు మాత్రం పూర్తి భిన్నంగా మారిపోయాడు. ఒకప్పటి వరకు ఆయనకు బ్యాడ్ బాయ్, ప్లే బాయ్ అనే ట్యాగ్‌లు తప్పవు. కానీ పెళ్లి తరువాత, ముఖ్యంగా కూతురు రహా పుట్టిన తర్వాత రణ్‌బీర్ జీవితం మొత్తానికే కొత్త మలుపు తిరిగింది. ఇటీవల ‘యానిమల్’ లో క్రూరమైన పాత్రలో మెప్పించిన రణ్‌బీర్, ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీ “రామాయణ”లో రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ కూడా మొదలైంది. వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా విడుదల చేయాలని టీమ్‌ ప్లాన్ చేస్తోంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా రణ్‌బీర్ ఇప్పుడు తన షెడ్యూల్‌ను తగ్గించుకుని, ఎక్కువ సమయం భార్య ఆలియా, కూతురు రహాతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అతని ఈ మార్పు వెనుక అసలు కారణం కూతురు రహానే. తాజా సమాచారం ప్రకారం రణ్‌బీర్ తన బేబీతో ఎక్కువ టైం గడపాలనే ఉద్దేశ్యంతో పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. మందు, సిగరెట్ పూర్తిగా మానేశాడు. ఇది కేవలం తన ఆరోగ్యానికే కాకుండా, తన కూతురు భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి అలవాట్లు మానేయడం కష్టం. కానీ రణ్‌బీర్ మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని వదిలేశాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అల్లు అరవింద్ కు GHMC షాక్.. కూల్చేస్తాం..

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు మరో షాక్ తగిలింది. ఈసారి అల్లు అరవింద్ కు GHMC షాకిచ్చింది. వివరాలలోకెళితే.. నిర్మాత అల్లు అరవింద్ కు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట భారీ భవనం ఉంది. 2023 లో అల్లు అరవింద్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసారు. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ కు కూత వేటు దూరంలో ఉంటుంది ఈ అల్లు బిజినెస్ పార్క్. అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా అప్పట్లో ఆ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని కూడా నెలకొల్పారు. ఈ అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి GHMC అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేశారు అల్లు అరవింద్. కానీ ఇటీవల GHMC అనుమతులు లేకుండా ఈ బిజినెస్ పార్క్ లో పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు తాము ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేసారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు.  నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని అధికారులు తెలిపారు. మరి అల్లు పార్క్ లోని పెంట్ హౌస్ కట్టడంపై అల్లు అరవింద్ ఎటువంటి వివరణ ఇస్తారో చూడాలి.

గ్రూప్-1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని TGPSC కి హైకోర్టు ఆదేశం

గ్రూప్-1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్-1 పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు.. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశం.. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని TGPSCకి ఆదేశం.. సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న హైకోర్టు.. మెయిన్స్ మెరిట్ లిస్ట్ ను హైకోర్టు రద్దు చేసింది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి.

టాలీవుడ్‌కు మరో లోకల్ హీరోయిన్ దొరికేసిందోచ్

లిటిల్ హార్ట్స్ రీసెంట్లీ రిలీజైన ఈ చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద మనస్సు చేసుకుని హిట్ చేశారు. మౌళి, శివానీ నాగారం ఫెర్మామెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 90స్ ఓటీటీ ఫిల్మ్స్‌తో మెప్పించిన మౌళికి ఇదే ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ కొట్టేశాడు యూత్ ఫుల్ హీరో. కానీ శివానీ నాగారంకు ఇది సెకండ్ ఫిల్మ్స్. అంతకు ముందే అంబాజీ పేట మ్యారేజ్ రూపంలో మంచి ఫెర్మామెన్స్ చూపించింది ఈ హైదరాబాదీ గర్ల్. షార్ట్ ఫిల్మ్స్ నుండి కెరీర్ స్టార్ట్ చేసిన శివానీ నగరం జాతి రత్నాలులో ఓ స్మాల్ క్యారెక్టర్లలో మెరిసింది. ఆ తర్వాత అంజాబీ పేట మ్యారేజ్ బ్రాండ్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ దక్కింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్‌లో కాత్యాయనిగా కుర్రకారు మనసు దోచేస్తోంది. అనుష్క, శివకార్తీకేయన్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తో పోటీగా దిగిన వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 12 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుని.. బడ్జెట్‌లో 200 పర్సెంట్ రికవరీ చేసిందని టాక్. శివానీ నాట్ ఓన్లీ యాక్టర్, మల్టీ టాలెంటర్ ఆల్సో. ఆమె క్లాసికల్ డ్యాన్సర్ అంతే కాదు సాంగ్స్ కూడా అద్భుతంగా పాడుతోంది. ఆరంభం అనే సినిమాలో ఓ సాంగ్ పాడింది శివానీ. ఈ లెక్కన టాలీవుడ్‌కు మరో తెలుగు టాలెంటెడ్ హీరోయిన్ దొరికేసినట్లే కనిపిస్తోంది. ప్రజెంట్ టాలీవుడ్‌లో నయా సెన్సేషనల్ గర్ల్‌గా అవతరించిన ఈ లోకల్ గర్ల్స్ మరోసారి సుహాస్‌తో హే భగవాన్ చేస్తోంది. షార్ట్ ఫిల్మ్స్ టూ బిజీ హీరోయిన్లుగా మారిన శ్రీ గౌరీ ప్రియా, వైష్ణవి చైతన్య సరసన నెక్ట్స్ ఈ భామ కూడా చేరుతుందేమో బిగ్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందేమో లెట్స్ వెయిట్.

 

Exit mobile version