ఇటీవల “స్పైడర్ మ్యాన్”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టామ్ హాలండ్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూస్తే హాలండ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. హీరోయిన్ జెండాయకు అభిమానుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. అయితే “స్పైడర్ మ్యాన్: నో వే హోమ్” హిట్ తరువాత అందరి కన్ను ఈ జంటపై పడింది. సినిమా ఎఫెక్టో ఏమో కానీ టామ్ హాలండ్, జెండాయ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు.. సీక్రెట్ డేటింగ్ చేస్తున్నారు అంటూ రూమర్లు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో వారిద్దరూ రియల్ గా కారులో ముద్దు పెట్టుకుంటూ దొరికిపోయారు. అయితే డేటింగ్ విషయంపై ఇద్దరూ సైలెంట్ గానే ఉన్నారు.
Read Also : Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఇల్లు కొన్నారంటూ వార్తలు బయలుదేరాయి. అయితే హాలండ్ మాత్రం ఆ వార్తలను కొట్టి పారేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హాలండ్ ఈ విషయంపై స్పందిస్తూ “వావ్… వాట్ ఏ సర్ ప్రైజ్… నేను తాళాలు ఎప్పుడు తీసుకోబోతున్నాను ?” అంటూ ప్రశ్నించాడు. “నేను సౌత్ లండన్‌లో కొత్త ఇల్లు కొన్నాను అనేది పూర్తిగా అవాస్తవం” అంటూ చెప్పుకొచ్చారు. ఇక తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన ఈ జంట సరైన సమయం వచ్చినప్పుడు తమ సంబంధానికి సంబంధించిన ప్రకటన చేయనున్నారట.