Tollywood Shooting Updates: టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ షూటింగ్ సందడి మొదలైంది. ఇన్నాళ్లూ కాస్త విరామం తీసుకున్న హీరోలు ఒక్కొక్కరుగా తిరిగి షూటింగ్ సెట్స్‌లో అడుగుపెడుతున్నారు. నందమూరి బాలకృష్ణ, తారక్ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు పలువురు హీరోల చిత్రాల షూటింగ్స్ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జోరుగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం ఏ హీరో సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? ఏ సినిమా ఏ లొకేషన్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ సినిమా షూటింగ్ కూడా చాలా నెలల తర్వాత ముంబై నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయింది. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ కోకాపేటలో కొనసాగుతోంది. బాలయ్య సినిమా ‘దాదా’ షూటింగ్ ఆయన లేకపోయినా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
అక్కినేని నాగార్జున నటిస్తున్న కింగ్ 100 సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సెరవేగంగా జరుగుతోంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘జనవరి 12న విడుదల’కు సిద్ధమవుతున్న సినిమా షూటింగ్ అజీజ్ నగర్‌లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా షూటింగ్ అక్టోబర్ 1 నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనుంది.
మరోవైపు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది. ఇంకా నితిన్, నాని కాంబినేషన్‌లో వస్తున్న అలియాస్ రుక్మిణి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అలాగే శర్వానంద్ నటిస్తున్న “జార్జ్ క్రిష్” సినిమా షూటింగ్ మొయినాబాద్‌లో జరుగుతోంది. శ్రీ విష్ణు నటిస్తున్న “రామ్ అబ్బరాజు” సినిమా షూటింగ్‌తో పాటు.. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న “సంబరాల ఏటిగట్టు” సినిమా షూటింగ్ కూడా కొనసాగుతోంది.
ఇక గోపీచంద్ నటిస్తున్న సినిమా షూటింగ్ కొన్ని వారాలుగా శంకరపల్లిలో జరుగుతోంది. ఇక హీరో కిరణ్ అబ్బవరం దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న రియాలిటీ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనుంది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్ సందడి మళ్లీ ఊపందుకుంది. స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరూ తమ తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా మారుతున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉండటంతో టాలీవుడ్‌లో మళ్లీ సందడి నెలకొంది.

