Sudheer Babu : టాలీవుడ్ కండలవీరుడు సుధీర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో సుధీర్ బాబును చూడగానే, స్పోర్ట్స్ మేన్ అని ఇట్టే పసిగట్టేయ వచ్చు. టాలీవుడ్ యంగ్ హీరోస్ లో సుధీర్ బాబు తరహా ఫిట్ బాడీ అరుదు అనే చెప్పాలి. అసలు అతని వయసు నాలుగు పదులు దాటింది అంటే నమ్మలేం. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా రాణించాడు సుధీర్. ఎంతోమంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ను తీర్చిదిద్దిన పుల్లెల గోపీచంద్ తో కలసి డబుల్స్ ఆడేవాడు సుధీర్. నటశేఖర కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శినిని పెళ్ళాడిన సుధీర్ కు అనుకోకుండా సినిమాలపై ఆసక్తి కలిగిందని చెప్పవచ్చు. తన భార్య ఇంటిలో ఆమె తండ్రి, అన్నలు, అక్క మంజుల అందరూ నటనలో ప్రవేశమున్నవారే. దాంతో సుధీర్ మనసు కూడా యాక్టింగ్ వైపు సాగింది. తన వదిన మంజుల ఘట్టమనేని నిర్మించిన ‘ఏ మాయ చేశావే’తో సుధీర్ తొలిసారి తెరపై కనిపించాడు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో రూపొందిన ‘ఏ మాయ చేశావే’ లో సమంత అన్నగా సుధీర్ నటించాడు. ఓ సీన్ లో హీరో నాగచైతన్యతో ఫైట్ కూడా చేస్తాడు. ఆ తరువాత ‘శివ మనసులో శ్రుతి’ (ఎస్.ఎమ్.ఎస్.) సినిమాలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. ఈ చిత్రంలోనే ఫైట్స్, డాన్సులతో ఆకట్టుకున్నాడు సుధీర్.
సుధీర్ పూర్తి పేరు పోసాని నాగసుధీర్ బాబు. 1980 మే 11న విజయవాడలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ ఆటపాటలంటే ఎంతో ఇష్టం. హీరోగా నటించిన తొలి చిత్రంలోనే చలాకీగా నటించేసి మార్కులు సంపాదించాడు. అతనికి తొలి రెండు సినిమాలు నటునిగా మార్కులయితే సంపాదించి పెట్టాయి. కానీ, అతను ఆశించిన విజయం దరి చేరలేదు. సినిమాటోగ్రాఫర్ జె.ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో మారుతి నిర్మించిన ‘ప్రేమ కథాచిత్రమ్’ సుధీర్ బాబు ఆశించిన విజయాన్ని అందించింది. తక్కువ పెట్టుబడితో రూపొందిన ‘ప్రేమకథా చిత్రమ్’ మంచి లాభాలను చూసింది. ఇందులో తన మామ కృష్ణ హీరోగా నటించిన ‘పచ్చని కాపురం’లోని “వెన్నెలైనా చీకటైనా…” సాంగ్ రీమిక్స్ లో నటించి అలరించాడు సుధీర్. ‘ప్రేమకథాచిత్రమ్’ ఘనవిజయం తరువాత సుధీర్ బాబుకు పలు అవకాశాలు పలకరించాయి. అయితే ఆచి తూచి అడుగేస్తూ తన పర్సనాలిటీకి తగ్గ పాత్రలనే ఎంచుకున్నాడు సుధీర్. “ఆడు మగాడ్రా బుజ్జి, క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, మోసగాళ్లకు మోసగాడు, భలే మంచి రోజు, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే, శ్రీదేవి సోడా సెంటర్ “ వంటి చిత్రాలలో సోలో హీరోగా ఆకట్టుకున్న సుధీర్, “శమంతకమణి, వీరభోగవసంతరాయలు, వి” చిత్రాలలో ఇతర హీరోలతోనూ కలసి నటించి అలరించాడు. వీటిలో ‘నన్ను దోచుకుందువటే’ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించాడు సుధీర్. మేచో మేన్ లుక్ ఉన్న సుధీర్ బాబుకు హిందీలో ‘బాఘీ’ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం లభించింది. తెలుగులో విజయం సాధించిన ‘వర్షం’ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించాడు. ‘బాఘీ’లో టైగర్ కు తగ్గ విలన్ అనిపించుకున్నాడు సుధీర్. తగిన పాత్ర దొరకాలే కానీ, తన సత్తా చాటుకుంటానని పలుమార్లు నిరూపించుకున్నాడు సుధీర్.
Also Read
- Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే 'వృషకర్మ' సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
కృష్ణ లాంటి సీనియర్ స్టార్ అల్లుడు, ఇప్పటి టాప్ హీరో మహేశ్ బాబు బావమరిది అయినా సుధీర్ ఏ రోజునా, భేషజాలకు పోలేదు. తన మనసుకు నచ్చితే చిన్న పాత్రలోనైనా నటించడానికి వెనుకాడలేదు సుధీర్. అలా కొన్ని చిత్రాలలో కేమియో రోల్స్ లోనూ అలరించాడు సుధీర్. ప్రస్తుతం సుధీర్ బాబు “అమ్మాయి గురించి మీకు చెప్పాలి“ చిత్రంలో నటిస్తున్నాడు. తన గురువు, మిత్రుడు అయన పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పాడు సుధీర్. ఆ చిత్రాన్ని ఏకంగా తెలుగు, హిందీ భాషల్లో నిర్మించే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఈ సినిమాలతో సుధీర్ బాబు ఏ తీరున జనాన్ని మురిపిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!