తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ ప్రారంభమైన సిరివెన్నెల అంతియయాత్రకు సర్వం సిద్ధమైంది. ఫిల్మ్ ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర కొనసాగనుంది.
Read Also : సిరివెన్నెలకు చివరి నివాళి… ఇండస్ట్రీ కన్నీటి పర్యంతం
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో మధ్యాహ్నం 1 గంటకు అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమయాత్రలో సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొననున్నారు. ఇక ఆయనకు కన్నీటి నివాళులు అర్పించడానికి కడసారిగా టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలంతా సిరివెన్నెల పార్థివదేహం సందర్శించి చివరిసారిగా నివాళులు అర్పించారు.