NTV Telugu Site icon

Tollywood Heroes: థ్రెడ్స్ ను కూడా వదలని టాలీవుడ్ హీరోలు.. ఎన్టీఆర్ తో సహా ఎవరెవరు జాయిన్ అయ్యారంటే.. ?

Threads

Threads

NTR: సెలబ్రిటీలకు- అభిమానులకు అనుసంధానం ఏదైనా ఉంది అంటే అదే సోషల్ మీడియా. ప్రస్తుతం ఈ సమాజంలో సోషల్ మీడియా వాడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సెలబ్రిటీలు సైతం అభిమానులు దగ్గరగా ఉండడానికి ఏ సోషల్ మీడియా యాప్ కనిపించినా అందులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, షేర్ చాట్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఫ్యాన్స్ మా హీరో ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాదించాడు అంటే మా హీరో ఎక్కువ అంటూ ఫాలోవర్స్ విషయంలో కూడా గొప్పలు చెప్పడం చూస్తూనే ఉంటాం. ఇక ఈ నేపథ్యంలోనే మరో కొత్త యాప్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అదే థ్రెడ్స్. నేటినుంచి ఈ యాప్.. గూగుల్ ప్లే స్టోర్ లో యాడ్ అయ్యింది. దీంతో ఎంటర్ టైన్ చేయడానికి కొత్త యాప్ వచ్చిందని డౌన్ లోడ్ బటన్ నొక్కేస్తున్నారు యువత.

Salaar: ‘సలార్’ టీజర్‏లో ఇంట్రెడక్షన్ ఇచ్చిన నటుడు ఎవరో తెలుసా?

ఇక ప్రేక్షకులు, అభిమానులు ఎక్కడ ఉంటే అక్కడే మేము అంటూ హీరోలు సైతం థ్రెడ్స్ లో జాయిన్ అయిపోతున్నారు. ఇక అన్నింటిలో ముందు ఉండే హీరో మహేష్ బాబు. సోషల్ మీడియాను ఎక్కువ వాడడంలో మహేష్ ముందు ఉంటాడు. ఇక మహేష్ తో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు థ్రెడ్స్ లో జాయిన్ అయ్యారు. ఇక తమ హీరోలు థ్రెడ్స్ లో కూడా దర్శనమివ్వడంతో అభిమానులు ఫాలో బటన్ ను నొక్కేస్తున్నారు. మరి ముందు ముందు ఈ యాప్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ను దాటేస్తుందేమో చూడాలి.