Tollywood Heroes: ఆ లుంగీలను మడతపెట్టి.. కడితే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Heroes: తెలుగు చిత్ర పరిశ్రమ.. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు.. బెల్ బాటమ్ ప్యాంట్స్ వేసుకుంటే.. ట్రెండ్.. ఆ తరువాత జీన్స్ వేసుకొంటే ట్రెండ్.. ఇక జనరేషన్ మారేకొద్దీ ట్రెండ్స్ అలా మారిపోతూ వచ్చాయి. ఒక్కో జనరేషన్ కు ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో లుంగీల ట్రెండ్ నడుస్తోంది. ఆ లుంగీలను మడతపెట్టి.. కడితే.. నా సామీ రంగా .. థియేటర్లు పగిలిపోవాల్సిందే. ఒకప్పుడు హీరోలు లుంగీలు కడితే .. ఏంటి.. ఈ హీరో ఇలా కనిపించాడు.. స్టైల్ గా లేడు అనేవారు.. కానీ, ఇప్పుడు అదే లుంగీ ఫేవరేట్ హీరో కడితే.. అస్సలు లుంగీలో ఎంత క్లాస్ గా ఉన్నాడురా అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు.. లుంగీ స్టైల్.. విజయాలను కూడా తెచ్చిపోయేడుతుంది. మహేష్ బాబు లుంగీ కట్టాడు అంటే .. హిట్ అని అభిమానుల సెంటిమెంట్. అందుకే గుంటూరు కారంలో కూడా మహేష్ లుంగీ లుక్ తో కనిపించాడు.
పోకిరి దగ్గరనుంచి గుంటూరు కారం వరకు.. సీన్ లోనైనా, సాంగ్ లోనైనా మహేష్ లుంగీ కట్టాల్సిందే. ఒక్క మహేష్ అనే కాదు.. సీనియర్, జూనియర్ హీరోలు అని లేదు.. అందరు ఆ లుంగీలను మడతపెట్టి.. కట్టేస్తూ మాస్ లుక్ లో అదరగొడుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్, నాని, విశ్వక్ సేన్.. ఇలా అందరు లుంగీలు కట్టి మాస్ లుక్ లో అదరగొట్టినవారే.
Also Read
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Daredevil: ఆ క్రేజీ సినిమా షూటింగ్‌పై శ్రీలీల సాలిడ్ అప్డేట్!
- Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
- Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
ఇక ప్రస్తుతం టాలీవుడ్ మాస్ కథలకే అభిమానులు ఓటు వేస్తున్నారు. ఇప్పటివరకు మన టాలీవుడ్ హీరోలు క్లాస్ సినిమాలు చాలా చేశారు.. లవ్ స్టోరీస్ ఇంకా ఎక్కువ చేశారు. ఇక ఇప్పుడు అంతా మాస్ మీద ఫోకస్ పెట్టారు. అందుకు కారణం అభిమానుల అభిరుచి మారడం. మా హీరో ఇలా ఉంటేనే మేము అంగీకరిస్తాం.. అన్నదగ్గరనుంచి.. కథను బట్టి మా హీరో ఎలా ఉన్నా మాకు ఓకే అనేవరకు వచ్చారు. దీంతో అభిమానులను ఎప్పటికప్పుడు మెప్పించడానికి వారి పల్స్ ను మేకర్స్ తెలుసుకొని సినిమాలు తీస్తున్నారు. ఇక ఇప్పుడు అభిమానులు తమ హీరోల లుంగీల లుక్ లు కావాలంటూ మేకర్స్ డిమాండ్ చేయడం వరకు వచ్చారు. ప్రస్తుతం గుంటూరు కారం లో మహేష్ లుంగీ లుక్ తో కనిపించాడు.. అంతకు ముందు భీమ్లా నాయక్ సినిమాలో పవన్, రానా ఇద్దరు లుంగీల్లో కనిపించి హల్చల్ చేశారు.
ఇక రంగస్థలంలో రామ్ చరణ్.. దువ్వాడ జగన్నాథం లో అల్లు అర్జున్.. దసరాలో నాని, నా సామీ రంగాలో నాగార్జున, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో విశ్వక్ సేన్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలు లుంగీలపై మనసు పడ్డారు. లుంగీ కట్టి, మీసం మెలేసి బరిలోకి దిగితే.. బాంచాత్ ఎదురుగా ఉన్న విలన్ కు చావు భయం కనిపించాల్సిందే. ఇక ఇదే లుక్ ను అభిమానులు కూడా ఇష్టపడడం విశేషం. ఏదిఏమైనా లుంగీ కట్టిన లుక్ లో ఉండే మాస్ మరెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. మరి ఇప్పుడు వస్తున్న హీరోలకు ఈ లుంగీ లుక్ ఎలాంటి విజయాలను అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Artist Srinivasan Dies: శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాన్ని గీసిన తొలి చిత్రకారుడు మృతి!
-
Shubhanshu Shukla: 2040 నాటికి చంద్రుడిపై భారత జెండా.. ఇదే నా అసలైన లక్ష్యం: వ్యోమగామి శుభాంశు శుక్లా
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్‌ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!