Site icon NTV Telugu

Tollywood: మీడియా ముందుకు వర్ధమాన నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?

Tollywood

Tollywood

ఒకపక్క బడా నిర్మాతలు అందరూ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అవుతుంటే, మరొక పక్క టాలీవుడ్‌కు చెందిన వర్ధమాన నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వారంతా మీడియాతో మాట్లాడతారని సమాచారం వచ్చింది. సరిగ్గా 2 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ సమావేశంలో వర్ధమాన నిర్మాతలు ఎస్‌కే‌ఎన్, ధీరజ్ మొగిలినేని, భైరవకోన నిర్మాత రాజేష్ దండ, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య చైతన్య, చాయ్ బిస్కెట్ సంస్థ అధినేతలు అనురాగ్ శరత్, మధుర శ్రీధర్, శివం భజే నిర్మాత మహేశ్వర్ రెడ్డి, వంశీ నందిపాటి, దిల్ రాజు బంధువు హర్షిత్ రెడ్డి, పేక మేడలు సినిమాతో నిర్మాతగా మారిన రాకేష్ వర్రేతో పాటుగా బెక్కం వేణుగోపాల్, శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు.

Also Read : Chinmayi Sripada : మీ పని మీరు చూసుకోండి.. రిపోర్టర్ పై చిన్మయి ఫైర్

పెద్ద నిర్మాతలు అందరూ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అవుతున్న సమయంలో వీరంతా ఎందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఒకవేళ నిర్మాతలు అందరూ కలిసికట్టుగా లేరా లేక చిన్న సినిమాల నిర్మాతలు వేరుగా ఇలా బయటకు వస్తున్నారా అని చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే, మీడియా సమావేశం తర్వాత ఈ అంశంపై పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version