ఒకపక్క బడా నిర్మాతలు అందరూ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అవుతుంటే, మరొక పక్క టాలీవుడ్‌కు చెందిన వర్ధమాన నిర్మాతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వారంతా మీడియాతో మాట్లాడతారని సమాచారం వచ్చింది. సరిగ్గా 2 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ సమావేశంలో వర్ధమాన నిర్మాతలు ఎస్‌కేఎన్, ధీరజ్ మొగిలినేని, భైరవకోన నిర్మాత రాజేష్ దండ, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి భార్య చైతన్య, చాయ్ బిస్కెట్ సంస్థ…