కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. 46 ఎల్లా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఆయన పార్థీవదేహాన్ని నిన్న సాయంత్రం ఇంటికి తరలించారు. అక్కడి నుంచి అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఆయన భౌతిక కాయాన్ని చివరిసారిగా చూసి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరు బయలుదేరారు.
Read Also : పునీత్ రాజ్ కుమార్ మృతి… పేద వ్యక్తి జీవితంలో వెలుగు
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో పాటు నరేష్, రాజీవ్ కనకాల, వంటి ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బెంగుళూరు బయలు దేరారు. కంఠీరవ స్టేడియానికి మెగాస్టార్ చిరంజీవి సాయంత్రం చేరుకోనున్నారు.