Site icon NTV Telugu

అభిమానులకు టాలీవుడ్ సెలెబ్రిటీల క్రిస్మస్ విషెస్

Christmas

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. వాస్తవానికి ఇది క్రిష్టియన్స్ పండగ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అన్ని పండగలను అందరూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ నెల వచ్చిందంటే పండగల కాలం అని చెప్పొచ్చు. ఎందుకంటే క్రిస్మస్ మొదలుకొని వరుసగా న్యూఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్ కూడా అతి తక్కువ గ్యాప్ తో సెలెబ్రేట్ చేసుకుంటాం.

https://ntvtelugu.com/omicron-scare-to-rrr-and-radhe-shyam/

ప్రస్తుతం అందరూ క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయారు. సెలెబ్రిటీలు సైతం తమ ఇంటికి లైట్స్ తో, క్రిస్మస్ ట్రీతో, శాంటా బొమ్మలతో అలంకరించి సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు స్టార్ హీరోలంతా క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో ట్విట్టర్ మొత్తం ‘హ్యాపీ క్రిస్మస్’ అనే విషెస్ తో నిండిపోయింది.

Exit mobile version