August Box Office: టాలీవుడ్‌లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్‌లు.. నాని Vs రవితేజ Vs శర్వా!

Nani, The Paradise, Sharwanand, Bhogi, Ravi Teja, Irumudi

Nani, The Paradise, Sharwanand, Bhogi, Ravi Teja, Irumudi

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు రాబోయే రోజులు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. జూన్ మొదటి వారంలో (జూన్ 4న) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాకు గనుక పాజిటివ్ టాక్ వస్తే, జూన్ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ హవానే నడవడం ఖాయం. ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్‌ను మరింత ఊపులోకి తెచ్చేందుకు పలు క్రేజీ చిత్రాలు క్యూ కట్టబోతున్నాయి.

ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు (August) నెల బాక్సాఫీస్ లైనప్ ఇప్పుడే చాలా సాలిడ్‌గా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు ఆగస్టు స్లాట్లను బుక్ చేసుకోగా.. తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఖరారైన డేట్ల ప్రకారం బాక్సాఫీస్ బరిలో ఉన్న సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ ప్రొమిసింగ్ ఫిలిం ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తర్వాత టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న భారీ చిత్రం ‘భోగి’ ఆగస్టు చివరి వారంలో, అంటే ఆగస్టు 28న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంది. ఇక గత కొన్ని చిత్రాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోయిన మాస్ మహారాజా రవితేజ.. ఈసారి ఒక వినూత్నమైన కథతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) కూడా ఆగస్టు రేసులోనే నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ ఫిలిం ‘విశ్వంభర’ కూడా ఆగస్టు రేసులోకి వచ్చే అవకాశం ఉందంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా, జూన్‌లో ‘పెద్ది’తో మొదలయ్యే టాలీవుడ్ బాక్సాఫీస్ జాతర.. ఆగస్టు నాటికి నాని, శర్వానంద్, రవితేజ వంటి స్టార్ల చిత్రాలతో మరింత హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.