Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Today Junglee Movie Completes 60 Years

అరవై ఏళ్ళ ‘జంగ్లీ’

Published Date :October 31, 2021 , 5:37 am
By Manohar
అరవై ఏళ్ళ ‘జంగ్లీ’
  • Follow Us :
  • google news
  • dailyhunt

అందాలతారగా సైరా బాను యావద్భారతదేశాన్నీ ఎంతగానో అలరించారు. ఆ రోజుల్లో సైరా బాను ఓ చిత్రంలో నటించింది అంటే సదరు సినిమా చూడటానికి రసికాగ్రేసరులు థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆ తరువాత మహానటుడు దిలీప్ కుమార్ ను పెళ్ళాడిన సైరా బాను సినిమాలకు దూరంగా జరిగారు. అయినా, సైరా బానును తమ కలలరాణిగా చేసుకొని ఎంతోమంది ఆనందించారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘జంగ్లీ’ అక్టోబర్ 31తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమా తెలుగులో యన్టీఆర్ హీరోగా ‘సరదా రాముడు’ పేరుతో రీమేక్ అయింది. 1961 అక్టోబర్ 31న జనం ముందు నిలచిన ‘జంగ్లీ’ సినిమాలోని పాటలు జనాన్ని ఎంతగానో అలరించాయి. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలచి, బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది.

జంగ్లీ కథలో పెద్దగా వైవిధ్యం కనిపించదు. అయితే, ఈ చిత్రానికి శంకర్ జైకిషన్ సంగీతం ప్రాణం పోసి, సినిమాను విజయతీరాలకు చేర్చిందని చెప్పొచ్చు. ‘జంగ్లీ’ కథలోకి తొంగి చూస్తే, ఓ జమీందార్ భార్యకు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి ఉంటారు. తమ ఇంటిలో అనవసరమైన మాటలు కానీ, నవ్వులు కానీ వినిపించరాదని జమిందారిణి ఆజ్ఞ. లండన్ లో చదువుకొని వచ్చిన ఆమె కొడుకు శేఖర్ తల్లి మాట జవదాటడు. ఇక కూతురు మాలా అన్నకు పూర్తి భిన్నం. సరదాగా నవ్వుతూ, తుళ్ళుతూ ఉంటుంది. తమ ఎస్టేట్ లో పనిచేసే జీవన్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఇది తెలిసిన తల్లి, శేఖర్ ను పిలిచి, కొంతకాలం మాలాను ఎక్కడికైనా తీసుకుపొమ్మంటుంది. చెల్లిని తీసుకొని శేఖర్ కాశ్మీర్ వెళ్తాడు. అక్కడ ఓ డాక్టర్ కూతురు రాజకుమారి పరిచయమవుతుంది. ఓ సారి అనుకోకుండా శేఖర్, రాజకుమారి మంచు తుఫాను కారణంగా ఓ చోట చిక్కుకుపోతారు. వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. రాజకుమారి పరిచయంతో శేఖర్ కు తొలిసారి జీవితంలోని అసలు మాధుర్యం బోధపడుతుంది. అతని ఆనందానికి అవధులు లేకుండా చిందులు వేస్తాడు. మాలా ఓ బిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయాన్ని రాజకుమారి, ఆమె తండ్రి డాక్టర్ రహస్యంగా ఉంచుతారు. కాశ్మీర్ నుండి తిరిగి వచ్చాక తనయునిలో మార్పు చూసి ఆశ్చర్యపోతుంది జమిందారిణి. మాలా, జీవన్ అప్పటికే రహస్య వివాహం చేసుకున్నారన్న సత్యం తెలుస్తుంది. చివరకు మనుషులంతా ఒక్కటే అన్న సత్యాన్ని తల్లికి తెలియజేసేందుకు శేఖర్ ఓ నాటకం ఆడతాడు. ఆమె కూడా రాజకుమారిని తన కోడలుగానూ, జీవన్ ను తన అల్లుడిగానూ ఆదరించడంతో కథ సుఖాంతమవుతుంది.

కథలో పెద్దగా వైవిధ్యం లేకపోయినా, సన్నివేశాలతో రక్తి కట్టించారు చిత్ర దర్శకనిర్మాత సుబోధ్ ముఖర్జీ. ఈ చిత్రానికి కథ, రచన కూడా ఆయనే నిర్వహించడం విశేషం. ఇందులో శేఖర్ గా షమ్మీకపూర్, రాజకుమారిగా సైరా బాను, మాలాగా శశికళ, జీవన్ గా అనూప్ కుమార్ నటించారు. మిగిలిన పాత్రల్లో లలితా పవార్, అజ్రా, మోనీ ఛటర్జీ, అజిత్ సేన్, శివ్ రాజ్, మెక్ మోహన్, హెలెన్ కనిపించారు. శంకర్ – జైకిషన్ బాణీలతో శైలేంద్ర, హస్రత్ జైపురి రాసిన పాటలు అలరించాయి. ఈ సినిమా అనగానే ఈ నాటికీ అందరికీ గుర్తుకు వచ్చే పాట – “ఛాహే కోయి ముఝే జంగ్లీ కహే…” అన్నదే. ఈ పాటతో పాటు “ఆయ్ ఆయ్ సుకు సుకు…”, “జా జా జా మేరే బచ్ పన్…” పాటలను కూడా శైలేంద్ర కలం పలికించింది. హస్రత్ జైపురి కలం నుండి “ఎహ్ సాన్ తేరే హోగా…”, “దిన్ సారా గుజారా తోరే అంగనా…”, “కష్మీర్ కీ ఖలీ హూ మై…”, “నై తుమ్ హారే మజేదార్…” పాటలు జాలువారి ఆకట్టుకున్నాయి. “ఛాహే కోయి ముఝే జంగ్లీ కహే…” పాటను మహ్మద్ రఫీ గానం చేశారు. ఈ పాటలో ముందుగా వినిపించే “యాహూ…” అన్న కేకను రఫీ వేయలేదని, ప్రయాగ్ రాజ్ అనే గాయకుడు అరిచారని తరువాతి రోజుల్లో హీరో షమ్మీ కపూర్ బయలు పరిచారు. ఇదే కథతో 1984లో కుమార్ గౌరవ్ హీరోగా ‘హమ్ హై లాజవాబ్’ అనే చిత్రం తెరకెక్కింది. ఏది ఏమైనా ‘జంగ్లీ’ సినిమా ద్వారా సైరా బాను వంటి అందాలతార పరిచయం అయ్యారు. ‘యాహూ…’ అంటూ మారుమోగి పోయిన పాట ఈ నాటికీ అలరిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Junglee movie
  • Junglee movie completes 60 years
  • movie completes 60 years

తాజావార్తలు

  • Abrar Ahmed: కావ్యా మారన్ టీమ్‌లోకి ఎంట్రీ.. ట్రోల్స్‌పై పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ షాకింగ్ రియాక్షన్!

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్.. ఇంకా అందని కంటెంట్.. షోలు రద్దయ్యే ఛాన్స్?

  • IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?

  • Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?

  • PEDDI : తమిళ్, కన్నడలో పెద్దికి పోటీ తప్పదా..?

ట్రెండింగ్‌

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions