కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (దక్షిణ భారత శాఖ) ఆధ్వర్యంలో చెన్నైలో నేడు, రేపు జరుగబోతున్న సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రాంతీయం కొత్త జాతీయం’ రిపోర్ట్ ను ఆవిష్కరించారు. ‘కళ అంటే కేవలం వినోదమే కాదు, గుట్కా, గంజాయి దురాచారాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రగతిశీల ఆలోచనల ఆధారంగా సామాజిక దురాచారాలను ఎత్తి చూపడమే కళ’ అని స్టాలిన్ చెప్పారు.
స్టాలిన్ సీఎం అయిన తర్వాత ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ సమ్మెట్ లో ఇవాళ మణిరత్నంతో పాటు ప్రముఖ తెలుగు దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్ పాల్గొన్నారు. తమిళ, కన్నడ, మలయాళ, తెలుగు రంగాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు, కథానాయకలు ఈ వేడుకకు హాజరయ్యారు. ఆజాదీ కా మహోత్సవ్ లో భాగంగా సాగుతున్న ఈ వేడుకలో నటీమణులు సుహాసిని, ఖుష్ బూ, లిజీ, సుజాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. దీనికి సంబంధించి ప్రతి కార్యక్రమానికి వీరు డ్రస్ కోడ్ పాటిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ రోజైతే రెడ్ కలర్ శారీస్ తో తగ్గేదే లే అంటూ అదరగొట్టారు.
