కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (దక్షిణ భారత శాఖ) ఆధ్వర్యంలో చెన్నైలో నేడు, రేపు జరుగబోతున్న సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రాంతీయం కొత్త జాతీయం’ రిపోర్ట్ ను ఆవిష్కరించారు. ‘కళ అంటే కేవలం వినోదమే కాదు, గుట్కా, గంజాయి దురాచారాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రగతిశీల ఆలోచనల ఆధారంగా సామాజిక దురాచారాలను ఎత్తి చూపడమే కళ’…