Tillu Square: మోత మోగించడానికి టిల్లు కొత్త రిలీజ్ డేట్ తో వస్తుండు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమా తెలుగు ఆడియన్స్ కి ఒక క్రేజీ క్యారెక్టర్ ని ఇచ్చింది. ఈ సినిమాతో సిద్ధూ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఈ సూపర్ క్రేజీ క్యారెక్టర్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేస్తూ మేకర్స్, ‘డీజే టిల్లు స్క్వేర్’ని రెడీ చేస్తున్నారు. ‘డీజే టిల్లు’ సినిమాకి సీక్వెల్ గా ‘డీజే టిల్లు స్క్వేర్’ సినిమా రూపొందుతుంది. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టిల్లు స్క్వేర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్ రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడి కాస్త వెనక్కి వెళ్లింది. జనవరి 12న సంక్రాంతి సీజన్ లో జరిగిన బాక్సాఫీస్ వార్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి గుంటూరు కారం సినిమా రిలీజ్ రేస్ లోకి వచ్చింది. ఈ సమయంలో జనవరి 13న రిలీజ్ కావాల్సిన మాస్ మహారాజా రవితేజ ఈగల్ సినిమా ఇండస్ట్రీ మంచి కోసం పోటీ నుంచి తప్పుకోని థియేటర్స్ ఇష్యూని తగ్గించింది.
ఈగల్ వెనక్కి తగ్గడంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్… రవితేజకి సోలో రిలీజ్ ని ప్రామిస్ చేసాయి. దీంతో ఈగల్ సినిమాని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. ఇదే రిలీజ్ డేట్ ని లాక్ చేసుకోని ఉన్న టిల్లు స్క్వేర్ సినిమా ఫెబ్ 9 నుంచి వెనక్కి వెళ్లింది. కొత్త రిలీజ్ కోసం టిల్లు ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉండగా మార్చ్ 29న టిల్లు స్క్వేర్ రిలీజ్ అవుతుంది అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. నో క్యాప్షన్… ఓన్లీ యాక్షన్ అంటూ రిలీజ్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేసారు. ఇందులో అనుపమ షార్ట్స్ వేసుకోని గ్లామరస్ గా కనిపించగా… పోస్టర్ డిజైన్ యూత్ ని తగ్గట్లు చేసారు. మరి టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ ని ఎప్పటినుంచి స్టార్ట్ చేస్తారు అనేది చూడాలి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/JLewl2IccZ
— Naga Vamsi (@vamsi84) January 26, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!