Tiger Nageswara Rao: ఆ లిరిక్స్.. మాస్ మహారాజా కటౌట్.. పర్ఫెక్ట్ సింక్ రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Nageswara Rao:మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు వంశీ. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా రేణు దేశాయ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
NTR: మాస్.. టెర్రిఫిక్.. ఇలాంటి పదాలు సరిపోవేమో.. దేవరకు దండం పెట్టడమే
Also Read
ఇక తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వీడు అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ లో హీరో క్యారెక్టర్ ను పవర్ ను ఫుల్ గా ఎలివేట్ చేసినట్లు కనిపించింది. లిరిక్స్ కూడా సినిమాలోనే కాకుండా బయట మాస్ మహారాజా రవితేజ కటౌట్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయని చెప్పాలి. చంద్రబోస్ రాసిన పవర్ఫుల్ లిరిక్స్ కు రవితేజ కటౌట్ కు ఈ సాంగ్ పర్ఫెక్ట్ సింక్ అయ్యిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్.. అనురాగ్ కులకర్ణి మెస్మరైజింగ్ వాయిస్ వేరే లెవల్ కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రంతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!