Tiger Nageswara Rao: టైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, టైం ఫిక్స్.. ఇక కాస్కోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Nageswara Rao Pre Release Event at Shilpakala Vedika: మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వర రావు రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో గజదొంగగా పేరు సంపాదించిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. కొత్త దర్శకుడు వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 15న హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. అక్టోబర్ 3న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇప్పుడు శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
KCR: ‘కేసీఆర్’గా రాకింగ్ రాకేష్.. ఇదేం ట్విస్టురా అయ్యా?
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తవగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ మూవీ రన్‌టైమ్ గురించి కూడా సినిమా యూనిట్ ఓ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఏకంగా 3.02 గంటలు ఉండనుందని చెబుతూ పోస్టు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఈ ఏడాది అత్యధిక రన్‌టైమ్ ఉన్న సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ నిలిచింది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 20న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందగా రవి తేజ సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటి రేణు దేశాయ్ హేమలత లవణం అనే ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!