Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి క్రేజీ అప్డేట్.. ఆరోజు దద్దరిల్లిపోవాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Nageswara Rao First Look To Release On May 24: మన టాలీవుడ్‌లో రూపొందుతోన్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. స్టూవర్టుపురంలో పేరుమోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సబ్జెక్టే చాలా ఆసక్తికరమైనది కావడం, ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్స్ క్రేజీగా ఉండటంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారాస్థాయి అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా రోజులు అవుతున్నా, ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వలేదు. దీంతో.. ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఇందులో రవితేజ లుక్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఎంతోకాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆ నిరీక్షణకు కళ్లెం వేసే సమయం ఆసన్నమైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారన్న విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. మే 24వ తేదీన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నామని, ఇందులో మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో రవితేజని చూడబోతున్నారని మేకర్స్ ప్రకటించారు.
Forest Area: అత్యధిక అటవీ ప్రాంతం గల టాప్-10 దేశాలు
Also Read
కాగా.. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. అంతేకాదు.. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, జిషూ సేన్‌గుప్తా వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తేజ్ అగర్వాల్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. ఈ సినిమాను రవితేజ ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎంతో శ్రద్ధతో వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన భారీఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Fierce and majestic 🔥@RaviTeja_offl like you've never seen him 💥💥#TigerNageswaraRao first look on May 24th ❤️🔥@AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla @SrikanthVissa @CastingChhabra @MayankOfficl pic.twitter.com/xLk2CTzxHI
— VAMSY (@DirVamsee) May 15, 2023
తాజావార్తలు
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!