Thug life : కమల్ హాసన్ హీరోగా వస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో వస్తోంది. ఈ మూవీ జూన్ 5న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తెలుగులో ఇప్పటికే ఓ ఈవెంట్ కండక్ట్ చేశారు. త్వరలోనే భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది మూవీ టీమ్. అయితే ఈ సారి హైదరాబాద్ లో కాకుండా విశాఖ పట్నంలో మే 29న భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కానీ దాదాపు ఫిక్స్ అయిపోయింది.
Read Also : Harish Rao : రేవంత్, ఉత్తంలే తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్లు
తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. కానీ ఎంత సేపు హైదరాబాద్ లోనే ఈవెంట్లు నిర్వహిస్తే అభిమానుల్లోకి బలంగా వెళ్లట్లేదనే భావన ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఈ సారి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే క్రమంలో విశాఖలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ మూవీలో కమల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అతి త్వరలోనే మూవీ టీమ్ వరుస ప్రమోషన్లతో జోరు పెంచబోతోంది. దీన్ని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్టు సమాచారం.
Read Also : Tej Pratap Yadav: 12 ఏళ్ల రిలేషన్.. గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన లాలూ పెద్ద కొడుకు..