NTV Telugu Site icon

Virupaksha Trailer: రుద్రవనాన్ని కాపాడే విరూపాక్ష వచ్చేశాడు

Virupaksha Trailer Review

Virupaksha Trailer Review

Thriller Trailer Released From Virupaksha: రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో.. చిత్రబృందం ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేసింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మొదటి నుంచి చివరివరకు.. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ, ఈ ట్రైలర్ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. కంటెంట్ ఏంటనేది స్పష్టంగా రివీల్ చేయలేదు కానీ, త్రిల్లింగ్ అంశాలు బాగానే ఉన్నాయి.

Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి

ఈ ఊరికి రాకపోకలు నిషేదం అనే హెచ్చరికతో స్టార్ట్ అయ్యే ఈ ట్రైలర్.. వెంటనే రొమాంటిక్ యాంగిల్ టర్న్ తీసుకుంటుంది. సాయితేజ్, సంయుక్తం మీనన్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అనంతరం ట్రైలర్ ఒక్కసారిగా త్రిల్లింగ్‌గా మారుతుంది. ప్రశాంతంగా కనిపించే ఆ ఊరిలో ఏదో కీడు జరుగుతోందని, ఏవో కనిపించని శక్తులు ఆ ఊరి జనాల్ని హరిస్తోందని హీరో పసిగడతాడు. ఇంతకీ ఆ కనిపించని శక్తులేంటి? వాటి నుంచి ఆ ఊరి ప్రజల్ని ఎలా కాపాడుతాడు? అనే చిక్కుముడులకు సమాధానమే ఈ సినిమా స్టోరీలా కనిపిస్తోంది. ఇక విజువల్స్ అయితే మైండ్‌బ్లోయింగ్‌గా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సబ్జెక్ట్‌కి సరిగ్గా కుదిరింది. ఓవరాల్‌గా ట్రైలర్ బాగుంది. మరి.. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అన్నట్టు.. ఈ ట్రైలర్‌లో సంయుక్త అందంగా మెరవడంతో పాటు ఆమె పాత్ర చుట్టూ ఏదో సస్పెన్స్ కూడా దాగి ఉండటాన్ని గమనించవచ్చు.

Bholaa Movie: భార్యతో కలిసి సినిమా చూశాడు.. డబ్బు ఖర్చు చేసిందని కొట్టాడు

కార్తిక్ దండు స్వీయ రచనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు దర్శకుడు సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించాడు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇదొక మిస్టికల్ త్రిల్లర్ కావడంతో.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో సునీల్‌తో పాటు బ్రహ్మాజీ, అజయ్‌, అభినవ్ గోమఠం, ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.

Show comments