Site icon NTV Telugu

Hanu-Man: హనుమాన్ నెగెటివిటీ.. ఆ హీరో ఫ్యాన్సే కారణమా.. ?

Man

Man

Hanu-Man: సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ మధ్య ఆ యుద్ధం రోడ్డు ఎక్కింది. ఒక హీరో ఫ్యాన్స్.. ఇంకో హీరో ఫ్యాన్స్ పై దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఇక వీరు మారరు అని నెటిజన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇవన్నీ కాకుండా తాజాగా.. హిట్ సినిమాపై నెగెటివిటీ ని స్ప్రెడ్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఒక చిన్న సినిమా.. స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. థియేటర్ లో అన్ని సినిమాలను వెనక్కి నెట్టి సంక్రాంతి హిట్ గా నిలిచింది. అదే హనుమాన్. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. మొట్టమొదటి సూపర్ హీరో కథగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్‌.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఇక నేడు ఈ సినిమా ఓటిటీలో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఒక్కసారిగా జీ 5 పై ఎగబడ్డారు. అంతా బావుంది అనుకొనే సమయంలో సడెన్ గా సోషల్ మీడియాలో హనుమాన్ పై నెగెటివిటీ ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా బాలేదని ఒకడు అంటే.. ఎక్కువ హైప్ ఇచ్చారు బ్రో.. ఏముంది సినిమా అని ఇంకొకడు కామెంట్ పెట్టాడు. అలా.. ఆ నెగెటివిటీ ట్రోల్ ఎక్కువ అయ్యాయి. దీంతో అంతగా హనుమాన్ పై నెగెటివిటీ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక ప్లాప్ అయిన సినిమానే ఓటిటీలో సూపర్ అంటూ చూస్తున్నారు. అలాంటిది రూ.350 కోట్లు వసూలు చేసిన సినిమాపై ఇలా రాళ్లు వేయడం పద్ధతేనా అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఒక చిన్న సినిమా.. తక్కువ బడ్జెట్.. హై క్వాలిటీ విజువల్స్.. అన్నింటికి మించి ఆదిపురుష్ కన్నా ఎక్కువ ప్రశంసలు పొందిన సినిమా గురించి ఇలా నెగెటివ్ గా మాట్లాడడం తప్పు అని అంటున్నారు.

ఇకపోతే ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే.. ఒక హీరో ఫ్యాన్స్ అని కొందరు చెప్పుకురావడం గమనార్హం. ఆ హీరో ఎవరు అనేది తెలియదు కానీ.. అసలు ఆ హీరోకు హనుమాన్ కు ఉన్న సంబంధం ఏంటి.. ? ఎందుకు ఆ హీరో ఫ్యాన్స్ .. హనుమాన్ పై పగబట్టారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశం గా మారింది. ఇక ఇంకోపక్క ఈ విషయం గురించి హనుమాన్ మేకర్స్ కూడా పట్టించుకోవడం లేదని టాక్. ఎందుకంటే తాము థియేటర్ లోనే తమ సత్తా చూపించమని, ఇప్పుడు ఒక 20 మంది, 30 మంది వచ్చి నెగెటివ్ కామెంట్స్ పెడితే తమ సినిమాకు వచ్చే నష్టమేమి లేదని చెప్పినట్లు వినికిడి. అంటే ఒక రకంగా చెప్పాలంటే.. కొండని చూసి కుక్క మొరిగితే కొండకి సెటా అని చెప్తున్నారట. ఇంకోపక్క.. థియేటర్ లో కూడా ఇంకా హనుమాన్ ప్రదర్శితమవుతోంది. 80 శాతం ఆక్యుపెన్సీతో.. అంత హిట్ సినిమా కాకపోతే థియేటర్ కు వెళ్లి చూడాల్సిన అవసరం ఏముందని హనుమాన్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ నెగెటివిటీ ఎప్పటికి ఆగుతుందో చూడాలి.

Exit mobile version