సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్-అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. #Thalaivar170 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ టైటిల్ ని డిసెంబర్ 12న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో ఎంకౌంటర్ కేసులో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం. డిసెంబర్ 12న రజినీకాంత్ బర్త్ డే కావడంతో ఆ రోజున తలైవర్ 170 సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ బయటకి రానున్నాయి. ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది కాబట్టి మేకర్స్ రజినీ ఫ్యాన్స్ కోసం ఒక సాలిడ్ గ్లిమ్ప్స్ ని కూడా వదిలితే అంతకన్నా కావాల్సింది ఇంకొకటి లేదు.
తలైవర్ 170 ప్రాజెక్ట్ కన్నా రజినీకాంత్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న సినిమా తలైవర్ 171. రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కలిసి చేయనున్న ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్ నుంచి ఫస్ట్ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నాయి అంటే రజినీ-లోకేష్ కాంబినేషన్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమా LCUలో కాకుండా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా రూపొందనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ అండ్ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న తలైవర్ 171 ప్రాజెక్ట్ నుంచి డిసెంబర్ 12న అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం. లోకేష్ రజినీకాంత్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తే కోలీవుడ్ మాత్రమే కాదు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుంది. మరి డిసెంబర్ 12న ఎలాంటి అప్డేట్స్ బయటకి రానున్నాయో చూడాలి.