This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
This Week Theatrical Releases: ఈ వారం థియేటర్లలోకి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రకరకాల జోనర్లకు సంబంధించిన సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆగస్టు 20, 21 తేదీల్లో విడుదలవుతున్న ఈ సినిమాల్లో భారీ యాక్షన్ సినిమాలతో పాటు యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ డ్రామాలు ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.
ఖలీఫా: పార్ట్ 1 (Khalifa: Part 1)
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో, వైశాఖ్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో గోల్డ్ స్మగ్లింగ్ కింగ్‌పిన్ పాత్రలో పృథ్వీరాజ్ నటిస్తుండగా, మాలీవుడ్ లెజెండ్ మోహన్‌లాల్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. పగ, ప్రతీకారం, మాఫియా సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆగస్టు 20న థియేటర్లలోకి వస్తోంది.
Also Read
అమీర్ లాగ్ (Ameer Log)
హైదరాబాద్ బస్తీ నేపథ్యంతో సాగే ఒక అద్భుతమైన యూత్ ఫుల్ అండ్ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా ఇది. ముగ్గురు ప్రాణస్నేహితుల చుట్టూ తిరిగే ఈ సినిమాను రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. డబ్బు కంటే స్నేహం, బంధాలే గొప్ప ఆస్తి అనే పాయింట్‌తో రమణ రెడ్డి సోమ ఈ చిత్రాన్ని మలిచారు. పూర్తి హైదరాబాదీ ఫ్లేవర్‌తో సాగే ఈ సినిమా ఆగస్టు 21న విడుదలవుతోంది.
ఇరుముడి (Irumudi)
మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం అయ్యప్ప దీక్ష, తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. గతాన్ని మర్చిపోయి ప్రశాంతంగా బతికే ఓ తండ్రి, కూతురి కోరిక మేరకు దీక్ష తీసుకున్న తర్వాత ఎదురైన సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఇది ఆగస్టు 21న విడుదలవుతోంది.
రామ్ ఇన్ లీలా (Ram in Leela)
తమిళంలో రియో రాజ్, వర్తిక జైన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. పెళ్లి కోసం అమ్మాయిని వెతికే క్రమంలో ఓ యువకుడికి ఎదురైన ఊహించని ట్విస్టులు, కామెడీ సంఘటనల నేపథ్యంలో రామచంద్రన్ కన్నన్ దీనిని రూపొందించారు. ఇది కూడా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)
గత ఏడాది ‘ప్రేమలు’ చిత్రంతో సంచలనం సృష్టించిన గిరీష్ ఏడీ దర్శకత్వంలో వస్తున్న తాజా మలయాళ ఫ్యామిలీ రొమ్‌కామ్ ఇది. నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో భావనా స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ ఏజ్ గ్యాప్ ఉన్న ఒక జంట మధ్య సాగే అందమైన ప్రేమకథ. ఈ సినిమా ఆగస్టు 21న ఓనమ్ పండుగ సందర్భంగా విడుదలవుతోంది.
మొదటి రాాత్రి (Modha Rathri)
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన తమిళ వెడ్డింగ్ కామెడీ డ్రామా ఇది. ఒక పెళ్లి చుట్టూ జరిగే గందరగోళం, నవ్వులు పూయించే సంఘటనలతో రాజా కరుప్పుసామి దీనిని డైరెక్ట్ చేశారు. ఆగస్టు 21న విడుదల.
బ్రహ్మకమల (Brahmakamala)
ఇది ఒక మహిళ చుట్టూ తిరిగే కన్నడ సోషల్ డ్రామా. సిద్ధు పూర్ణచంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 20, 2026న థియేటర్లలో విడుదల కానుంది. అద్వితి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘U’ సర్టిఫికేట్ ఇచ్చింది, కాబట్టి ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా నిలుస్తోంది. అనంత్ ఆర్యన్ సంగీతం అందించిన ఈ సినిమా, సోషల్ మెసేజ్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Healthy Winter Recipes: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బలం.. చలికాలంలో తినాల్సిన హెల్తీ లడ్డూను నిమిషాల్లో చేసుకోండి!
-
AP Local Body Elections: ఎన్నికల అనంతరం అలర్ట్.. ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.. డీజీపీ కీలక ప్రకటన
-
Constitution Day: కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు: అనురాగ్ ఠాకూర్
-
Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
-
December Rule Changes: డిసెంబర్ 1 నుంచి మారబోతున్న రూల్స్ ఇవే.. ఎస్బీఐ కార్డుల బాదుడు నుంచి ఆధార్ ఫ్రీ అప్డేట్ వరకు!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!