Site icon NTV Telugu

Akkineni Nagarjuna : సీఎం మీటింగ్ కి నాగార్జున ఆమె వలనే రాలేదట..?

nagarjuna

nagarjuna

ఏపీ సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై సినీ ప్రముఖులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, ఆర్ నారాయణమూర్తి .. జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలను వివరించి పరిష్కారం కోరారు. ఇక ఈ మీటింగ్ కి చాలామంది స్టార్లు గైర్హాజరు అయినా విషయం తెల్సిందే. అందులో అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ ఈ భేటీకి రాకపోవడానికి కారణం అక్కినేని అమల అని తెలుస్తోంది.

ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో నాగ్ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే నాగ్ ఈ భేటీకి హాజరు కాలేదట. అయితే మొన్నటికి మొన్న నా సినిమాలకు, ఏపీ సినిమా టికెట్ రేట్స్ అడ్డు రావని బాహాటంగానే చెప్పాడు నాగార్జున. అంతేకాకుండా చిరంజీవి అందరి తరుపున మాట్లాడానికి వెళ్లారు అని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ కారణం చేత కూడా నాగ్ హాజరుకాలేదని మరికొంతమంది అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే నాగ్ నోరు విప్పేవరకు ఎదురు చూడాల్సిందే.

Exit mobile version