Site icon NTV Telugu

Suriya64 : వెంకీ అట్లూరి – సూర్య ‘టైటిల్’ ఇదే

Suriya64

Suriya64

తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. కానీ ఇన్నిరోజులు సూర్య తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయలేదు. ఇప్పడు ఇన్నాళ్ళకు సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. సార్, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన సూర్య బర్త్ డే పోస్టర్ కు మంచి స్పందన లభించింది.

Also Read : Rahul Sipligunj : ప్రేయసితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అనిల్ కపూర్ పాత్ర ముఖ్య భూమిక పోషిస్తుందట. అయితే యునిట్ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారట. ప్యూర్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గా వస్తున్న ఈ సినిమాకు ‘ విశ్వనాధం అండ్ సన్స్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. కథకు తగ్గట్టు ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని అందుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారట.  విశ్వనాధం అండ్ సన్స్ వెంకీ అట్లూరి కిరీర్ లో బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని యూనిట్ ధీమాగా ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా G.V ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version