Site icon NTV Telugu

Suriya45 : సూర్య – ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ ఇదే

Surya 45

Surya 45

తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది చివర్లో కంగువతో వచ్చిన ఈ హీరో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు వేటికవే డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పడు నెక్ట్స్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సూర్య కూడా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Also Read : Exclusive : తమిళ హీరోలకు తెలుగు దర్శకులు అలా.. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు ఇలా

ప్రస్తుతం RJ బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ను నేడు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. రురల్ బ్యాక్డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సూర్య 45ను నిర్మిస్తోంది. కాగ ఈ చిత్రానికి మొదట ఆస్కార్ విన్నర్ A.R రెహమాన్ సంగీతం దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ వచ్చి చేరాడు. నేడు రిలీజ్ చేసిన పోస్టర్ లో అఫీషియల్ గా ప్రకటించారు. RJ బాలాజీ గతంలో నయన తార లీడ్ రోల్ లో వచ్చిన అమ్మోరు తల్లి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. సూర్యతో తెరకెక్కించే సినిమాతో ఫ్యాన్స్ ను హిట్ సినిమా ఇస్తాడని టీమ్ బలంగా నమ్ముతోంది.

Exit mobile version