Thiruveer: ఈ కుర్రాడు జోరు మాములుగా లేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thiruveer: చక్కటి హావ భావాలు, నటనతో యాక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్నాడు తిరువీర్.. పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978, మసూద వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ యంగ్ హీరో విజయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న తిరువీర్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై సాయి మహేష్ చందు, సాయి శశాంక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తిరువీర్ సరసన ద్రిష్టి తల్వార్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Apsara Rani: ఆర్జీవీ కలల రాణి ఏంటీ.. ఇలా మారిపోయింది
Also Read
రెండు వేర్వేరు ప్రపంచాలు కలయికగా యూనిక్‌నెస్‌తో కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. డార్క్ కామెడీ జోనర్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు తెలిపారు. తిరువీర్ మరో విలక్షణమైన పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. లియోన్ జేమ్స్ సంగీత సారథ్యం వహించనున్న ఈ చిత్రానికి సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో తిరువీర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?