Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న ‘ఓ సుకుమారి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oh Sukumari: తెలుగు సినిమాల్లో కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే ప్రేమకథలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా, డిఫరెంట్ ఆలోచనతో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కు ముందే ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘ఓ సుకుమారి’. తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా చిత్రబృందం రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించింది. చిత్ర యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఓ సుకుమారి’ సినిమా 2026 జూలై 17న థియేటర్లలో విడుదల కానుంది. ఒక ఎలక్ట్రిఫైయింగ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కథలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఉండబోతోంది. హీరో హీరోయిన్ను తాకిన ప్రతిసారి షాక్ కొట్టడం కథలో మైన్ పాయింట్ గా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి ప్రేమ ఎలా సాగింది? చివరకు ఎలా ఒక్కటయ్యారు? అనే అంశాల చుట్టూ కథ నడవనున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా ఇదే కాన్సెప్ట్‌కు అనుగుణంగా డిజైన్ చేశారు. పోస్టర్లో కనిపించిన విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ కొత్త తరహా ప్రేమకథ ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్ చేసేలాగే కనబడుతోంది. ఈ చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రబృందం, విడుదలకు ముందు మరిన్ని ఆసక్తికర అప్డేట్లను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కాన్సెప్ట్‌లు, వినూత్నమైన ప్రేమకథలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ‘ఓ సుకుమారి’ ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు జూలై 17న థియేటర్లలోకి రానున్న ఈ ఎలక్ట్రిఫైయింగ్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Tags
- cinema
- Oh Sukumari
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?