TheyCallHimOG2 : OG -2.. నిర్మాణ భాద్యతలు ఆ రెండు సంస్థలకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ OG. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ‘OG 2’ స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు సుజీత్. మొదటి భాగంలో కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్ మరియు స్టైల్ తో మ్యాజిక్ చేసిన సుజీత్ ఈసారి కథపై మరింత దృష్టి పెట్టారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రీక్వెల్ స్టోరీలో సుజీత్ కొత్త క్యారెక్టర్లను పరిచయం చేయబోతున్నారు. జపాన్‌లో ‘ఓజాస్ గంభీర’ సృష్టించిన అసలు విద్వంసం ఏమిటి? అతను గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? అనే కోణంలో ఈ సినిమా ఉండబోతోంది.
ఇందుకోసం కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులను ఎంపిక చేసే పనిలో సుజీత్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘OG 2’ నిర్మాణ బాధ్యతల నుండి DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ తప్పుకున్నట్లు సమాచారం. దీనికి బదులుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.నిజానికి సుజీత్ తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో ‘బ్లడీ రోమియో‘ చేయాల్సి ఉంది. అయితే నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఆలస్యం కావడంతో సుజీత్ తన పూర్తి సమయాన్ని ‘OG 2’ స్క్రిప్ట్ కోసం కేటాయించారు. నాని డేట్స్ ఖాళీ అయ్యేలోపు ‘OG 2’ పనులను ఓ కొలిక్కి తీసుకురావాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ‘OG 2’ లో సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ కంటెంట్ మరియు ఊహించని మలుపులతో సుజీత్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు.
Also Read
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
- The Paradise: 'పెద్ది' రిజల్ట్ చూశాక కూడా 'ది పారడైజ్' పాఠాలు నేర్వలేదా?
తాజావార్తలు
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
-
SIR Row: ఎన్నికల కమిషనర్ల భేటీ.. SIR వివాదంపై ఈసీ క్లారిటీ.. ఏం చెప్పిందంటే..
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?