ముగిసిన ‘మా’ పోలింగ్.. కొత్త రికార్డు..

ఉత్కంఠబరితంగా సాగుతోన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మధ్యామ్నం 2 గంటలకు పోలింగ్‌ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడంతో.. రెండు ప్యానెళ్లకు చెందిన.. ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణుతో మాట్లాడి.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ను పొడిగించారు.. ఇక, ఈ ఏడాదిలో మా ఎన్నికల పోలింగ్‌ కొత్త రికార్డులను సృష్టించింది చివరి సమాచారం అందినప్పటి వరకు 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అందులో 605 మంది పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటే.. 60 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ వేశారు.. మొత్తంగా రికార్డు స్థాయిలో 62 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది.. గత ఎన్నికల్లో కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా.. ఈసారి రెండు ప్యానెళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఓటింగ్‌ శాతం అనూహ్యంగా పెరిగింది.. మధ్యాహ్నం 3 గంటల లోపు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నవారికి ఓటువేసే అవకాశం కలిపిస్తున్నారు పోలింగ్‌ సిబ్బంది.. ఇక, పోలింగ్‌ ముసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక, ఒక్కో పానెల్ నుండి‌ ఇద్దరు మాత్రమే పోలింగ్ బూత్ లోకి రావాలని ఎన్నికల అధికారులు రెండు ప్యానెళ్లకు సూచించారు.

-Advertisement-ముగిసిన 'మా' పోలింగ్.. కొత్త రికార్డు..

Related Articles

Latest Articles