పాన్ ఇండియా టాప్ టెన్ స్టార్స్ లిస్ట్ తీస్తే… అందులో నలుగురు టాలీవుడ్ హీరోలే ఉంటారు. అసలు పాన్ ఇండియా సినిమాలకు పునాది వేసిందే ప్రభాస్, రాజమౌళి. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌నే. బాహుబలితో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసిన ప్రభాస్.. పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌కు పాన్ ఇండియా కాదు… గ్లోబల్ క్రేజ్ తీసుకొచ్చాడు రాజమౌళి. అయితే నెక్స్ట్ రాజమౌళి సినిమాతో ఏకంగా హాలీవుడ్‌ను టచ్ చేయబోతున్నాడు మహేష్ బాబు కానీ ప్రస్తుతానికైతే తెలుగు నుంచి ఈ నలుగురే పాన్ ఇండియా హీరోలు. అందుకే టాప్ టెన్ లిస్ట్‌లో వీళ్లు ఖచ్చితంగా ఉంటారు. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ సర్వే పోర్టల్ ఆర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించిన టాప్ టెన్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ రిలీజ్ చేసింది.
ఇందులో నలుగురు టాలీవుడ్ హీరోలు… ముగ్గురు తమిళ హీరోలు, ముగ్గురు హిందీ హీరోలకు చోటు దక్కింది. అయితే పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో ఎవరంటే ఠక్కున ప్రభాస్ పేరు చెబుతారు. కానీ ఊహకందని విధంగా ఫస్ట్ ప్లేస్‌లో కోలీవుడ్ హీరో విజయ్ ఉన్నాడు. ప్రభాస్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్‌లో షారుక్ ఖాన్, నాలుగో స్థానంలో ఎన్టీఆర్, ఐదో స్థానంలో అజిత్ ఉన్నాడు. ఇక ఆరో స్థానంలో అల్లు అర్జున్, ఆ తర్వాత సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ చోటు దక్కించుకున్నారు. తొమ్మిది, పది ర్యాంకుల్లో అక్షయ్ కుమార్, సూర్య నిలిచారు. అయితే ఆర్మాక్స్ సంస్థ నెల నెలకు ఇలాంటి సర్వేలు చేస్తుంటుంది. కాబట్టి.. టాప్ టెన్ లిస్ట్ ఎప్పటికప్పుడు మారుతునే ఉంటుంది. కానీ ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ.. ఈ నలుగురు మొనగాళ్లు మాత్రం టాప్ టెన్‌లోనే ఉంటారు.