థియేటర్‌కి వెళ్లలేని ఆడియన్స్ కోసం… ఈ వారం ఓటీటీల్లోకి ఎంటర్ అవుతున్న సినిమాలు బాగానే ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో… డిఫరెంట్ భాషల్లో… వీకంతా ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిన మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం…
థమా : హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా అక్టోబర్ 21న థియేటర్స్ లోకి వచ్చిన రొమాంటిక్ కామెడి హారర్ థ్రిల్లర్ థమా, హర్షవర్ధన్ రాణె, సోనమ్ బజ్వా జంటగా వచ్చిన రొమాంటిక్ డ్రామా ఏక్ దీవానే కి దివానియత్ ఈ రెండు సినిమాలు కూడా డిసెంబర్ 16న అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. డిజిటల్ ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకట్టుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
రాజు వెడ్స్ రాంబాయి : తెలుగు ఆడియన్స్ కోసం తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన లవ్, రొమాంటిక్ & ఎమోషన్ కలిసిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి నవంబర్ లో రిలీజ్ అయిన ఈ లో బడ్జెట్ మూవీ థియేటర్స్ లో భారీ వసూళ్లు రాబట్టింది. డిసెంబర్ 18 నుంచి ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.
ప్రేమంటే : లవ్ స్టోరీ అభిమానులకు ప్రియదర్శి, ఆనంది జటంగా నవంబర్ 21న రిలీజ్ అయిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడి డ్రామా ప్రేమంటే.. డిసెంబర్ 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో పెద్దగా అలరించలేక పోయిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
డోమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ : మిస్టరీ, కామెడీ థ్రిల్లర్ జానర్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన డోమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ డిసెంబర్ 19 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్‌కు వస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్‌లో మిస్ అయినవాళ్లకు ఇది ఓటీటీలో మంచి ఛాన్స్‌గా మారింది. ఈ వారం ఓటీటీల్లో లవ్, ఫన్, ఫ్యామిలీ, మిస్టరీ అన్నీ ఉన్నాయి…
