Skanda: సాధారణంగా ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ పదిరోజుల్లో ఉంది అంటే ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో హంగామా.. పోస్టర్లు.. ఇంటర్వ్యూలు.. అబ్బో ఓ రేంజ్ లో ఉంటాయి. కానీ, స్కంద విషయంలో ఈసారి అది ఏది కనిపించడం లేదు. రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు సలార్ రిలీజ్ ఉంటే.. స్కంద ఈపాటికీ రిలీజ్ కూడా అయిపోయేది. కానీ, సలార్ వాయిదా పడడంతో స్కంద వెనక్కి వెళ్ళింది. సరే వాయిదాల విషయం పక్కన పెడితే.. రిలీజ్ కు ఇంకా 10 రోజులు కూడా సమయం లేదు.. అయినా మేకర్స్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. పాన్ ఇండియా మూవీ అంటే.. ఏ రేంజ్ లో ప్రమోషన్స్ ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో ఒక సినిమా హిట్ అవుతుందా.. ? ఫట్ అవుతుందా.. ? అనేది ప్రమోషన్స్ బట్టి చెప్పేస్తున్నారు ప్రేక్షకులు.
Payal Ghosh: ఎన్టీఆర్ హీరోయిన్ ఏంట్రా.. ఈ రేంజ్ లో చూపిస్తోంది.. దేవుడా..
స్కంద షూటింగ్ పూర్తయిన తరువాత వెంటనే రామ్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ కు వెళ్ళిపోయాడు రామ్.. ఇక శ్రీలీల బిజీ షెడ్యూల్ గురించి అస్సలు చెప్పనవసరం లేదు. ఇక డైరెక్టర్ బోయా తన స్ట్రాటజీని నమ్ముకున్నాడు. అఖండ .. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా హిట్ అందుకోవడంతో.. తన సినిమాలు ప్రమోషన్స్ లేకుండానే హిట్ అవుతాయి అని బోయా నిదానంగా కూర్చున్నాడు అనుకుంటే.. మరి రామ్.. ఆయన స్ట్రాటజీ ఏంటి.. గతేడాది నుంచి రామ్ ప్లాప్స్ లో ఉన్నాడు. ఇదేమో మాస్ సినిమా.. అందులోనూ పాన్ ఇండియా సినిమా. తన మార్కెట్ కు తగ్గ ప్రమోషన్స్ చేయకపోతే.. ప్రేక్షకులు ఎలా సినిమాకు వస్తారు. ఇది కూడా ఆలోచించాలి కదా అని నెటిజన్స్ అంటున్నారు. మరి ముందు ముందు రామ్ ఎలాంటి ప్రమోషన్స్ మొదలుపెడతాడో చూడాలి.