తెలుగు చిత్రపరిశ్రమ సక్సెస్ వెనుకే పరిగెడుతుందనటానికి ఉదాహరణలు కో కొల్లలు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనన్యపాండే. అమ్మడు విజయ్ దేవరకొండతో పూరి తెరకెక్కించిన ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర’లో హీరోయిన్. ఈ చిత్రం విడుదలకు ముందు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ లో అనన్య పాండేకి భారీ డిమాండ్ ఉండేది. అమ్మడి అందం, స్క్రీన్ ప్రెజన్స్, ఫ్రెండ్లీ గ్లామర్ షోతో పాటు సినిమా ప్రచారంలో చక్కగా పాలు పంచుకోవడంతో పలువురు తనని హీరోయిన్ గా తమ సినిమాల్లో బుక్ చేసుకోవాలని ఉబలాట పడ్డారు. ఎన్టీఆర్, కొరటాల సినిమాతో సహా మరి కొన్ని తెలుగు చిత్రాలకోసం అనన్యను అప్రోచ్ అయ్యారు.
అయితే ‘లైగర్’ సినిమా హిట్ అయితే భారీ పారితోషికం డిమాండ్ చేయవచ్చనే ఉద్దేశ్యంతో అనన్య ఏ సినిమా సైన్ చేయలేదు. ‘లైగర్’ హిట్ అయి ఉంటే రూ.4 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేయాలన్నది అన ప్లాన్. అయితే ఆ సినిమా ఫ్లాప్ కావటంతో కనీసం ఒకటిన్నర నుంచి 2 కోట్ల వరకూ అయినా ఓకె చేయాలని భావించింది. అయితే మన టాలీవుడ్ లో నటీనటులను వారి సక్సెస్ రేటును బట్టి కన్సిడర్ చేస్తుంటారనే విషయం అమ్మడికి బోధపడలేదు.
‘లైగర్’ రిలీజ్ తర్వాత గతంలో అనన్యకు సినిమా ఆఫర్ చేసిన వారు పత్తా లేకుండా పోయారు. ఎన్టీఆర్ సినిమాకి సైతం కియారా అద్వానీ, రష్మిక మందన్న, కృతి సనన్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. రశ్మక ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇది గమనించే కాబోలు అనన్య ఇకపై టాలీవుడ్ వైపు తొంగిచూడకూడదని అనుకుంటుందట.
పూర్తిగా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుందట. ఇంతకు ముందు కూడా ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ‘సాహో’ సినిమా చేస్తుంటే అందులో నటించిన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌కి సినిమా విడుదలకు ముందే పలు తెలుగు సినిమాలలో ఆఫర్స్ పలకరించాయి. ‘సాహో’ రిలీజ్ అయి పరాజయం పొందటంతో శ్రద్ధా వంక చూసే వారే లేకుండా పోయారు. ఇక్కడ అంతా సక్సెస్ మాట్లాడుతుంది. సక్సెస్ అయితే కోటి ఎక్కువ అయినా వెంటపడి మరీ బుక్ చేసుకుంటారు. లేకుంటే కనుచూపు మేరల్లో కనిపించరు. తత్వం బోధపడే అనన్య బాలీవుడ్ కే పరిమితం అవ్వాలని డిసైడ్ అయిందన్నన మాట.
