NTV Telugu Site icon

Orange: థియేటర్స్ ని మ్యూజికల్ కాన్సర్ట్ లా మార్చేసారు…

Orange

Orange

ఈమధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైనా అకేషణ్ వస్తే చాలు ఆ హీరో కెరీర్ లో బెస్ట్ మూవీ అనిపించుకున్న సినిమాని అభిమానులు రీరిలీజ్ చేసి థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఒక్కడు, పోకిరి, జల్సా, ఖుషి, గ్యాంగ్ లీడర్, టెంపర్, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలు రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త హిస్టరీని క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాలు హిట్, యావరేజ్ ఇలా అయినవి ఉన్నాయి కానీ డిజాస్టర్ అయిన ఒక సినిమాని ఫాన్స్ స్కై హై రేంజులో సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు లేవు. ఆ లెక్కని సారి చేస్తూ 12 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాని అభిమానుల కోరిక మేరకు రీరిలీజ్ చేశారు. ఫస్ట్ రిలీజ్ సమయంలో ఫ్లాప్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ కి కల్ట్ క్లాసిక్ స్టేటస్ తెచ్చుకున్న ఆరెంజ్ సినిమాని పుష్కర కాలం తర్వాత రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోస్ వేశారు.

ఈ షోస్ కి మెగా అభిమానులు చేస్తున్న హంగామా చూస్తుంటే నాగబాబు ఈ సినిమాని ఇప్పుడు ఎందుకు ప్రొడ్యూస్ చెయ్యలేదు అనిపించకమానదు. ఆరెంజ్ సినిమా థియేటర్స్ ని మ్యూజికల్ కాన్సర్ట్ లా మారుస్తూ సినిమాలో వచ్చే ఆరు పాటలని ఒక్క లిరిక్ కూడా వదలకుండా మెగా అభిమానులు పాడుతూ ఉంటే థియేటర్స్ మారుమోగుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక స్పెషల్ షోస్ పడిన సినిమాకి అభిమానులు ఈ రేంజులో హంగామా చెయ్యడం చూడలేదు. ఈరోజు రేపు తెలుగు రాష్ట్రాలతో పాటు, బెంగుళూరు, చెన్నై ప్రాంతాల్లో ఆరెంజ్ స్పెషల్ షోస్ పడనున్నాయి. ఈ షోస్ నుంచి వచ్చే కలెక్షన్స్ ని జనసేన పార్టీకి డొనేట్ చేస్తాను అని నాగబాబు చెప్పడంతో మెగా అభిమానులు మరింత జోష్ తో ఆరెంజ్ సినిమాని చూడడానికి వెళ్తున్నారు. మరి ఈ స్పెషల్ షోస్ కారణంగా జనసేన పార్టీకి ఎంత డొనేషన్ వెళ్తుందో చూడాలి.

Show comments